Home » ఇండోనేషియా చండీ కింపులన్ ఆలయ శివలింగ రహస్యం

ఇండోనేషియా చండీ కింపులన్ ఆలయ శివలింగ రహస్యం

by Lakshmi Guradasi
0 comment

కింపులన్ ఆలయం – చండీ అంటే దేవాలయం, కింపులన్ అంటే ఈ గ్రామం యొక్క పేరు. అనేక రహస్యాలను కలిగి ఉన్న ఈ కింపులన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం 14 సంత్సరాల క్రితం జరిగింది. ఇండోనేషియాలో డిసెంబర్11, 2009 వ సంత్సరం లో కొత్త ఇస్లామిక్ విశ్వవిద్యాలయ లైబ్రరీ నిర్మాణానికి పునాదులు వేయడానికి భూమిని తవుతున్నారు అప్పుడే ఒక ఆలయం కనిపించింది. ఈ ఆలయం దాదాపు 5 మీటర్ల భూగర్భ లోతులో పాతిపెట్టబడింది. ఇది ఒక శివుని ఆలయం. లింగం ఆకారం 2 భాగాలుగా ఉంటుంది. పైన భాగం వృత్తం ఆకారంలో మరియు కింద భాగం చతురాశ్ర ఆకారం లో ఉంటుంది. 

చరిత్ర:

విగ్రహాల శైలి మాతరం రాజ్య కాలంలో 9వ నుండి 10వ శతాబ్దాల కాలంలో నిర్మాణం జరిగిందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. సాంబిసరి, మొరంగన్ మరియు కెదులన్ ఆలయాల మాదిరిగానే, ఈ ఆలయం కూడా మౌంట్ మెరాపి నుండి వచ్చిన అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా పూడ్చబడిందేమో అని భావిస్తున్నారు. 

నిర్మాణ శైలి : 

కింపులన్ ఆలయం ఆకట్టుకునే హిందూ శిల్పలతో ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన ఆలయ నిర్మాణం ఆండీసైట్ రాతితో చెక్కబడింది.  ఆలయం యొక్క స్తంభం మరియు పైకప్పు బహుశా చెక్కతో లేదా కొన్ని ఆర్గానిక్  పదార్ధాలతో తయారు చేయబడి ఉండవచ్చు, అవి కాలక్రమేణా కుళ్ళిపోయాయి అనుకుంట వాటి జాడలు లేవు. ఈ ఆలయం అనేక చతురస్రాల గోడల రాతి పునాది. లోపలి గదులలో వినాయకుడు, నంది మరియు లింగం-యోని విగ్రహాలు ఉన్నాయి.

ఆలయ రహస్యాలు :

లింగం కింద చతురస్రా ఆకారంలో ఒక రంధ్రం ఉంది. ఆ రంద్రం లో ఒక రతి పాలక వుంది. అది 17 క్యావిటీ లతో ఉంది. అందులో 8 క్యావిటీలు దిక్కులను చూపిస్తున్నాయి, అవి బంగారం రేకులు కలిగి వున్నాయి. ఇంకొక్క 8 క్యావిటీలు చిన్నవి అవి వెండి రేకులు కలిగి ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద రౌండ్ వుంది దానిలో కూడా పెద్ద బంగారపు రేకు ఉంది. ఈ బంగారం మరియు వెండి ని అమ్మర్చి లింగం రంధ్రం లో పెట్టి, అభిషేకించిన నీరు వెళ్లేలా సెట్ చేశారు. అభిషేకించిన బంగారపు రేణువుల నీరు ను తాగడం వలన ఆరోగ్య సమస్యలను తీర్చుకోవచ్చు అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. 

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ను చుడండి

You may also like

Leave a Comment