Home » అవిసే గింజలు తో ఇడ్లి పొడి

అవిసే గింజలు తో ఇడ్లి పొడి

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. అవిసే గింజలు – 1 కప్పు.
  2. మినుములు – పావు కప్పు.
  3. శనగపప్పు – పావు కప్పు.
  4. ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు.
  5. జీలకర్ర – 2 టీస్పూన్.
  6. నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు.
  7. వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది.
  8. చింతపండు – నిమ్మకాయంత.
  9. ఎండు మిర్చి – 15.
  10. కరివేపాకు – కొద్దిగ.
  11. ఇంగువ – చిటికెడు.
  12. బెల్లం – అర టీస్పూన్.
  13. ఉప్పు – సరిపడా.
  14. నూనె – సరిపడా.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకుని దానిలో కస్త నూనె వేసి అవిసె గింజలు, మినుములు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కాస్త నునే వేసి ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి…కస్త వేగాక చింతపండు, 15 ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోని పక్కన పెట్టుకోని రెండు నిమిషాలు పాటు చల్లారానివాలి. చల్లారాక బెల్లం, ఉప్పు కలిపి…ఈ పదార్ధాలన్నింటినీ తీసుకొని మిక్సింగ్ జార్ లోకి వేసుకుని పొడిలా చసుకోవాలి. ఆ తరువాత అవిసే గింజల పొడిని ఒక బౌల్ లో వేసుకుంటే సరిపోతుంది. ఇపుడు అవిసే గింజలు ఇడ్లీ పొడి రెడ్డి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment