Home » అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా (Ammamma Mayamma) సాంగ్ లిరిక్స్

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా (Ammamma Mayamma) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.3K views
ammamma mayamma amma durgamma song lyrics

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా
అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా

లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మా
శోకాలు మాపిటి కల్ప వల్లివే దుర్గమ్మా
లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మా

అష్టచేతులున్న అమ్మ భవానీ.. దుర్గమ్మా
అష్ట సంపదలిచ్చే అనురాగ వల్లీ.. దుర్గమ్మా
దీనుల కాపాడే దివ్య రూపిణివే.. దుర్గమ్మా
ప్రాణకోటికి ఆధారము నీవే.. దుర్గమ్మా

కోటిమాయలు గల్ల దొరసానీవమ్మా
నీపాటి లోకాన ఎవ్వరున్నారమ్మా

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా .. దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా.. దుర్గమ్మా
లోకాలనేలేటి లోకమాతవే .. దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్పవల్లివే.. దుర్గమ్మా

ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు.. దుర్గమ్మా
భక్తులను కాపుడుతున్నావు తల్లీ.. దుర్గమ్మా
కృష్ణవేణి నది తీరమునందు .. దుర్గమ్మా
కష్టాలు ఎడబాపే దొరసాని నీవే .. .దుర్గమ్మా

గణగణ గంటల్ల మోతల్లో నీవూ..
ఘనముగ పూజలు అందుతున్నావూ..

అమ్మమ్మ మాయమ్మ బొమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా
లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మా

నువ్వు లేని ఈ జగమే లేదు .. దుర్గమ్మా
నీ చలువ లేకుంటే మా బతుకు లేదు .. దుర్గమ్మా
నీకన్నా మాకింక దిక్కెవరు లేరు.. దుర్గమ్మా
నిన్ను నమ్ముకుంటే భయమింక లేదు .. దుర్గమ్మా

నీ కరుణ మాపైన కురిపించవమ్మా.. ఆ ఆ
మా తోడునీడగా నీవుండవమ్మా

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా
లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మా

ఏటేటా బెజవాడ క్షేత్రము మేమూ … దుర్గమ్మా
తప్పకుండ తల్లి వచ్చేమమ్మా .. దుర్గమ్మా
మొక్కుకున్న నీ ముడుపులు మేమూ .. దుర్గమ్మా
మరువకుండా నీకు ఇచ్చేదమమ్మా.. దుర్గమ్మా

నీ చల్లనైన దీవెన తల్లి…
మాపైన కురిపించు మా కనకదుర్గా

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా
లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మా

అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మా దుర్గమ్మా
ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మా
శోకాలు బావే కల్పవల్లివే దుర్గమ్మా
శోకాలు బాపేటి కల్ప వల్లివే దుర్గమ్మా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.