అమ్మా.. వినమ్మా.. నేనానాటి.. నీ లాలి పదాన్నే
ఓ.. అవునమ్మా.. నేనేనమ్మా..
నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్ళూ.. నిదరలోనే ఉన్నా
గానమై ఈనాడే.. మేలుకున్నా
నీ పాదాలకు మువ్వల్లా.. నా అడుగులు సాగాలమ్మా
నీ పెదవుల చిరునవ్వుల్లా.. నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే.. అమ్మ
అణువణువణువూ నీ కొలువే.. అమ్మా
ఎదసడిలో శృతిలయలు నువ్వే.. అమ్మా
నే కొలిచే శారదవే..
నన్ను నిత్యం నడిపే.. సారథివే
బెదురు పోవాలంటే.. నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే.. కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే.. నువ్వే తినిపించాలి
ప్రతి మెతుకు.. నా బ్రతుకనిపించేలా
నువ్వుంటేనే నేను.. నువ్వంటే నేను
అనుకోలేక పోతే.. ఏమైపోతానూ
నీ కడచూపే నన్ను.. కాస్తూ ఉండకా
తడబడిపడిపోనా చెప్పమ్మా…
మరి మరి నను నువ్వు మురిపెముగా..
చూస్తూ ఉంటే చాలమ్మా
పరి పరి విధముల గెలుపులుగా..
పైకెడుగుతూంటానమ్మా..
అయినా సరే.. ఏనాటికీ
ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే.. అమ్మ
అణువణువణువూ నీ కొలువే.. అమ్మా
ఎదసడిలో శృతిలయలు నువ్వే.. అమ్మా
నే కొలిచే శారదవే..
నన్ను నిత్యం నడిపే.. సారథివే
_____________________________
సాంగ్ : అమ్మ (Amma)
చిత్రం: ఓకే ఒక జీవితం (Oke Oka Jeevitham)
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
నటీనటులు : అమల అక్కినేని (Amala Akkeneni), రీతూ వర్మ (Varma), శర్వానంద్ (Sharwanand)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.