Home » చింతచిగురు పులిహోర – తయారీ విధానం

చింతచిగురు పులిహోర – తయారీ విధానం

by Haseena SK
0 comment

కావలసినవి పదార్థాలు:

  1. చింతచిగురు – ఒక కప్పు.
  2. పొడి అన్నం – రెండు కప్పులు.
  3. వేరుశనగ పప్పు – 2 చెంచాలు .
  4. పచ్చి శనగ పప్పు – 2 చెంచాలు.
  5. ఆవాలు – అర టీ స్పూన్.
  6. మినపప్పు – 2 చెంచాలు.
  7. పసుపు – అర టీ స్పూన్.
  8. కరివేపాకు – రెండు రెబ్బలు.
  9. ఎండుమిర్చి – 3 లేదా4.
  10. పచ్చిమిర్చి – 2 లేదా 3.
  11. నూనె – తగినంత.
  12. ఉప్పు – తగినంత.
  13. ఇంగువ – చిటికెడు.

తయారీవిధానం :

ముందుగా ఒక గిన్నె లో రెండు కప్పులు బియ్యం తీసుకుని బాగా కడిగి పక్కనపెటుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టిన బియ్యం వేసుకొని పొడి పొడిల ఉడికిన తరువాత వంచుకోవాలి. ఇప్పుడు సేగను పెట్టినప్పుడు దానిలో గుంట ల చేసుకుని దానిలో చింత చిగురు వేసి ఆవిరి వచ్చే వరకు ఉంచాలి. స్టవ్ ఆవ్ చేయకుండా ఒక పెన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి అది వేడి అయ్యాక. ఆవాలు, మినపప్పు,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చిశనగ పప్పు, వేరుశనగ పప్పు వేసి వేగే దాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. వేగిన తర్వత తగినంత ఉప్పు, పసుపు, ఇంగువ చిటికెడు వేసి దించుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ముందుగా తయారు చేసిన పొడి పొడి తీసుకొని తాయారు చేసిన పోపును వేసుకోవాలి దాన్ని బాగా కలపాలి. ఇప్పుడు చింతచిగురు పులిహోర రెడీ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment