Home » ఓట్స్ యాపిల్స్ షేక్

ఓట్స్ యాపిల్స్ షేక్

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. పాలు – 2 కప్పులు.
  2. ఓట్స్ – అర కప్పు.
  3. యాపిల్స్ – 3.
  4. వేరుసెనగలు – పోవు కప్పు.
  5. పంచదార – కొద్దిగ.
  6. హార్లిక్స్ పౌడర్ – కొద్దిగ.
  7. దాల్చినచెక్క పొడి – కొద్దిగ.
  8. జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు.
  9. ఐస్ ముక్కలు – 3 లేదా 4.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసి వేడి చేసుకుని చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారీనా పాలు తీసుకుని ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఆ తరువాత మరో గిన్నె తీసుకుని దానిలో ఓట్స్ వేసుకొని దొరగ వేయించి పక్కన పెట్టుకోవాలి మరియు జీడిపప్పు వేసి దొరగ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు యాపిల్స్ రెండితిని తొక్క, గిమ్జాలు తొలగించి…ముక్కలుగా కట్ చేసుకొని….పప్పుగుత్తి సహాయంతో కచ్చాబిచ్చగా గుజ్జులా చేసుకోవాలి. మిగిలిన ఆ ఒక యాపిల్ ని నచ్చినవిధంగా కట్ చేసి గార్నిష్ కి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నె తీసుకుని దానిలో వేరుసెనగలు వేసి దొరగ వేయించి, తిక్క తీసి…కొన్నింటిని గార్నిష్ కి పక్కన వుంచుకుని…మిగిలినవి కచ్చాబిచ్చగా మిక్సీకి లో వేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తురువాత యాపిల్ గుజ్జు, మిక్సీకి పట్టిన వేరుసెనగ మిశ్రమం, ఫ్రిజ్ లో పెట్టుకున పాలు, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి అభిరుచిని బట్టి బెల్లం కూడా కలుపుకోవచ్చు. అనంతరం ఓట్స్ వేసుకుని…మరోసారి కలిపి. ఈ మిశ్రమం ని తీసుకొని మిక్సి జార్ లోకి వేసుకుని చిక్కగా చేసుకోవాలి. ఆ తరువాత ఓట్స్ యాపిల్స్ మిశ్రమంని ఒక గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసుకుని పైనా హార్లిక్స్ పోడర్, దాల్చినచెక్క పొడి, వేయించిన జిడిపోపుల్లు, ముందుగా నే కట్ చేసుకున్న యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment