Home » పనీర్ పావ్ బాజీ – తయారీ విధానం

పనీర్ పావ్ బాజీ – తయారీ విధానం

by Rahila SK
0 comments

కావలసిన పదార్థాలు:

  1. పనీర్ తురుము – పావుకిలో.
  2. నూనె – రెండు టేబుల్ స్పూన్లు.
  3. మెంతి ఆకులు – ఒక టేబుల్ స్పూన్.
  4. పెరుగు – అర కప్పు.
  5. ధనియల పొడి – ఒక టీస్పూన్.
  6. జీలకర్ర పొడి – ఒక టీస్పూన్.
  7. పావ్ బాజీ మసాలా – ఒక టీస్పూన్.
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్.
  9. చాట్ మసాలా – ఒక టీస్పూన్.
  10. గరం మసాలా – ఒక టీస్పూన్.
  11. వెన్న – రెండు టేబుల్ స్పూన్లు.
  12. బిర్యాని ఆకు – ఒకటి.
  13. ఉల్లిపాయలు – మూడు.
  14. టొమాటో ముక్కలు – ఒక కప్పు.
  15. ఉప్పు – తగినంత.
  16. పాలు – అర కప్పు.
  17. నీళ్లు – సరిపడా.
  18. పసుపు – అర టీస్పూన్.
  19. మిరియాల పొడి – పావు టీస్పూన్.
  20. పచ్చిమిర్చి – రెండు.
  21. శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు.
  22. కారం – 1 టీస్పూన్.
  23. కొత్తిమీర తురుము – 2 టీస్పూన్లు.

తయారీ విధానం:

ముందుగా ఒకటి లేదా రెండు టొమాటోలు, మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి. ఇపుడు పనీర్ మరియు కొత్తిమీర ని తీసుకొని వాటినిని తురుములా చేసుకొని పకన్నాపెట్టుకోవాలి.

ఇపుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెన్ తీసుకుని దానిలో శనగ పిండి మరియు మెంతి ఆకులు ను వేసి దోరగా వేయించి పకన్నాపెట్టుకోవాలి. ఆ తరువాత రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకోని అందులో తగినంత ఉప్పు, కారం,పెరుగు,శనగ పిండి మరియు మెంతి ఆకుల మిశ్రమం వేసి కలపాలి…జీలకర్ర పొడి, పావ్ బాజీ మసాలా, చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి వేసుకుని కొద్దీ కొద్దీగా నీళ్లు పోసుకుంటూ ఉడికించాలి. ఇపుడు మరో పెన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వెన్నను వేసి వేడి చేసి, అందులో ఒక బిర్యాని ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులో శనగ పిండి మరియు మెంతి ఆకుల మిశ్రమం కూడా వేసి కలుపుకోవాలి. ఆ తరువాత పనీర్ తురుము, కొత్తిమీర తురుము, పాలు వేసి కలిపాలి… కాసేపు ఉడికించాలి. ఉడికించక, పావ్ బాజీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment