హాయ్ తెలుగు రీడర్స్ ! ఏంటి క్రికెట్ లో మనకు తెలియకుండానే షాడో లా అనే ఒక రూల్ ఉందా అనుకుంటున్నారా.. అవునండోయ్ నిజంగానే ఒక రూల్ ఉంది. అసలు ఏంటి దీనిగురించి అనే విషయానికి వస్తే, మనం క్రికెట్ మ్యాచ్స్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఫీల్డర్లు బ్యాట్సమెన్ చూట్టు ఎక్కువ మంది ఉండడం మనం గమనిస్తాం.
అటువంటి సందర్భంలో ఆ ఫీల్డర్స్ యొక్క నీడ ఆ బ్యాటింగ్ పిచ్ మీద పడుతుంది.దీని వల్ల ఆ బ్యాట్సమెన్ ఏకాగ్రత దెబ్బతింటుంది. అప్పుడు అతడికి ఇబ్బందిగా ఉంటుంది. దీనిని నివారించడానికి షాడో లా అనే ఒక రూల్ ని తీసుకువచ్చారు. ఈ రూల్ ప్రకారం బౌలర్ నుండి వచ్చిన బాల్ ను బ్యాట్సమెన్ ని చేరే వరకు చూట్టు ఉన్న ఫీల్డర్లు కదలకుండా నిలబడాలి, ఒక వేళ కదిలితే రూల్ బ్రేక్ కింద అంపైర్ కి బ్యాట్సమెన్ అప్పీల్ చేసుకోవచ్చు.
ఈ రూల్ ని పాటించడం వలన బ్యాట్సమెన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, దీన్నే షాడో లా అంటారు. అయితే వెనకాల ఉండే కీపర్ కి అదేవిధంగా కీపర్ పక్కన వుండే స్లిప్ ఫీల్డర్స్ కి ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే వీరి నీడ అనేది పిచ్ మీద పడదు, ఒక వేళ పడినా అది బ్యాట్సమెన్ కి వెనుకవైపు పడుతుంది. దీని వల్ల బ్యాట్సమెన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కీపర్, స్లిప్ ఫీల్డర్స్ కి ఈ రూల్ వర్తించదు, వీరు కదలవచ్చు.
మరిన్ని క్రీడావిశేషాల కొరకుతెలుగు రీడర్స్ క్రీడలుని సందర్శించండి.