Chettanaka Puttanaka song lyrics
(పల్లవి)
చెట్టనక పుట్టనక వాగనక వంకనక నీ కొండకొస్తున్నానయ్య
అయ్యప్ప నిను చూడ వస్తున్నానయ్య
రాళ్ళనక రప్పనక రేయనక పగలనక నేనడిచి వస్తున్నానయ్య
అయ్యప్ప వెనకడుగు నేనయ్యనయ్యా
(చరణం 1)
నాగుండె చాటున బాధాల భారాన్ని ఇరుముడిలో ముడుపుగట్టి
నాకంట కన్నీళ్లు నా ఇంట కష్టాలు తొలగిపోవాలని మొక్కి (2)
శరణమంటూ నిన్ను పిలిచిన వాడినయ్యా
ఆ కొండల్ల కూసొన్నావు అయ్యప్ప నీవంతా చూస్తున్నావు
మా శరణాలు వింటున్నావు మణికంటా నాకంట నీవున్నావు
చెట్టనక పుట్టనక వాగనక వంకనక నీ కొండకొస్తున్నామయ్య
అయ్యప్ప నిను చూడ నేనొస్తున్నయ్యా
(చరణం 2)
అన్ని ఉన్నప్పుడు అందరున్నారయ్య ఏమి లేనప్పుడు ఎవరు లేరు అయ్యా
పైసలున్న దినము ప్రాణమన్నారయ్య వెన్నుపోటు పొడిచి మోసగించిరయ్య
ఆదరించలేదోయినోళ్లు చేరదీయలేదు నావాళ్లు (2)
నాగోడు వినవయ్యా ఈ ఘోరమేందయ్యా అయ్య నీలాగ లేనయ్యా
నా తోడు రావయ్యా ఒకసారి కనవయ్యా నన్ను గట్టెక్కించవయ్యా (2)
కన్నెస్వామినయ్య కరుణించరావయ్యా
ఆ కొండపై నిలుచున్నావు అయ్యప్ప నాగుండెల కొలువున్నావు
మా శబరి వాసుడవు మణికంట నీ దరికి నడిచినాను
చెట్టనక పుట్టనక వాగనక వంకనక నీ కొండకొస్తున్నామయ్య
అయ్యప్ప నిను చూడ నేనొస్తున్నయ్యా
(చరణం 3)
ఆకలన్నవాని కడుపునింపినాను ఆఖరికి దిక్కులేనివానయ్యాను
సాయం అడిగితే కాదనకుండా ఇచ్చాను అన్యాయము చేసి నన్నాడుకున్నారు
నేనేమి చేతును అయ్యప్ప నీవే దిక్కనుకున్న మణికంట (2)
కన్నీళ్ళ కడలిలో కదలలేకున్నాను స్వామి అయ్యప్పా
ఈ ముళ్ళ చిక్కుల్లో చిక్కుకుంటిన్నాయ్యా విడిపించరావయ్యా (2)
మహిమగల మణికంటుడ నీవయ్యా
నీ నామమే పలికితిని నీ రూపమే చూడకోరితిని
నీ ధ్యానమే చేసితిని నీ పాదమే నేను నడిచితిని
చెట్టనక పుట్టనక వాగనక వంకనక నీ కొండకొస్తున్నామయ్య
అయ్యప్ప నిను చూడ నేనొస్తున్నయ్యా
(చరణం 4)
నలబై యొక్క దినము మాలెసుకుంటి చన్నీటి స్నానము నేనాచరిస్తి
నల్లబట్టలు నేనేసుకుంటి కాలినడక పాదయాత్ర నేను చేస్తి
నిన్ను మరవలేను అయ్యప్ప నిన్నే నమ్ముకుంటి మణికంట (2)
దయచూపవయ్యా శ్రీధర్మశాస్త్ర స్వామి అయ్యప్పా
పాపాలు తొలగించు హరిహర పుత్రా ఈ జన్మ చాలయ్య (2)
కరిమల వాసా కరుణించరావయ్యా
స్వామి శరణం అయ్యప్పా శరణు శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శరణు శరణం అయ్యప్పా
చెట్టనక పుట్టనక వాగనక వంకనక నీ కొండకొస్తున్నానయ్య
అయ్యప్ప నిను చూడ నేనొస్తున్నయ్యా
రాళ్ళనక రప్పనక రేయనక పగలనక నేనడిచి వస్తున్నానయ్య
అయ్యప్ప నిను చూడ వస్తున్నానయ్య
Read also : Avarannarayya nuvvu levani lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

