shivudantaru harudantaru song lyrics

శివుడంటారు హరుడంటారు భవుడంటారు సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

shivudantaru harudantaru song lyrics

శివుడంటారు హరుడంటారు భవుడంటారు నిన్ను
ఏ పేరు పిలవాలే స్వామి
భగవంతుడు నీవంటారు అభిషేకము ప్రియమంటారు
నిన్నేలా కొలవాలే స్వామి

భోళా శంకరుడంటారు భక్తుల బాంధవుడంటారు
మా లీల గణవయ్య స్వామి
యేలే యేలే యేలే

మాయలోడా జంగముడా శంభో శంకరా
కట్టు బొట్టు కొప్పు చుట్టూ చిత్రమ్మ దొరా
లోకమంతా చేతులెత్తి మొక్కే శంకరా
ఓ జోలవట్టి బిచ్చమెత్తేవు అర్ధం కావురా

అమ్మకేమో బంగారు కాసులు
నీకేమో ఒంటికి పూసలు
ఏమిటయ్యా నీ వింత లీలలు
సత్యమిదే కదయ్యా
జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

ఎండి కొండల మహారాజువంట
బండరాయిల కొలువుంటావంట
లింగ రూపాన కొలువుండ నిన్నే
అన్ని గండాలు బాపుతావంట

జంగమోలే నీ రూపమంట
జాలిగల్లా దేవుడవంత
దిక్కు నువ్వు అని మొక్కితే చాలు
తిప్పలన్నీ తీరుస్తావంట

మొక్కుకుంటే మోక్షమే ఇస్తావు
కోరుకుంటే వరములే ఇస్తావు
నమ్ముకుంటే నటరాజ నిన్నే
నిమ్మలంగా కాపాడుకుంటావు జంగమో

జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

విశ్వమంతా నీ రూపమయ్య
శూన్యమే నీ ఆకారమయ్య
నల్ల రంగు రూపుడవయ్య
నల్ల నాగులు చుట్టినవయ్య

భస్మమే నీ బంగారమయ్య
ఆత్మనేగా నివాసమయ్య
ఆది అంతం నీవే కదయ్యా
ఆది దేవా మా శంకరయ్య

నువ్వు లేని జీవ లేదయ్యా
నువ్వు లేని అణువు లేదయ్యా
ప్రాణమంటే ఓంకారమయ్య
పాహి పాహి మా జంగమయ్య
జంగమో

జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

జంగమో జంగమా
జగమంతా గాసెటి లింగమా
జంగమో జంగమా
నీ ఆటే నాటక రంగమా

_______________

Read also : shiva shiva antune lyrics Ram Miriyala

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like