Home » నువ్విలా ఒక్కసారిలా – Nuvvila Okkasarila Song Lyrics – Manasara

నువ్విలా ఒక్కసారిలా – Nuvvila Okkasarila Song Lyrics – Manasara

by Lakshmi Guradasi
37 views
nuvvila okkasarila song lyrics Manasara

నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా
గుండె లోపలా ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా..
నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా..

చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటూ ఏ మూల ఉంది
గుండెల్లోనా గుచ్చేస్తోంది సూదిలా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఏంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది
అంత చిత్రంగా ఉంది ఈ రోజు ఏమైందిలా నువ్విలా..
నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా..

చంద్రుణ్ణి మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా
తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బులతో స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవతా
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు
ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా నువ్విలా..

నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా

గుండె లోపలా గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా
నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా

In English Version:

Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa
Koyilaa enduko ilaa ninnu choosthu choosthu chaalilaa
Gunde lopalaa undundi entilaa
Okkasaarigaa inninni kavvinthalaa nuvvilaa..

Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa
Koyilaa enduko ilaa ninnu choosthu choosthu chaalilaa..

Choodaali choodaali antu nee thode kaavaali antu
Naa praanam allaaduthondhi lolopala
Inthandham innaallnundi daakkuntu ye moola undi
Gundellona gucchesthondhi soodhilaa

Pere adagalanundhi maate kalapalanundhi
Entho pogadaalanundhi ninne ninne
Konchem gammathugundhi konchem kangaarugundhi
Antha chitrangaa undhi ee roju emaindhilaa nuvvilaa..

Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa
Koyilaa enduko ilaa ninnu choosthu choosthu chaalilaa..

Chandruni mingesindhemo vennelni thaagesindhemo
Enthentho muddhosthunnadhi bommalaa
Thaaralni ollanthaa poosi mabbulatho snaanaalu chesi
Musthaabai vachchesindhemo devathaa

Mottham bhoogolamanthaa poole challesinattu
Meghaalandhesinattu undhe undhe
Nanne laagesthunnattu neepai thosesthunnattu
Ento dorlesthunnattu edhedho avuthondhilaa nuvvilaa..

Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa
Koyilaa enduko ilaa ninnu choosthu choosthu chaalilaa

Gunde lopalaa guvvala gumpula okkasaarigaa inninni kavvinthalaa
Nuvvilaa nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa
Koyilaa enduko ilaa ninnu choosthu choosthu chaalilaa

_______________________

Song Credits:

సాంగ్ : నువ్విలా (Nuvvila)
చిత్రం: మనసారా (Manasara)
నటీనటులు: విక్రమ్, శ్రీ దివ్య(Vikram, Sri Divya)
సంగీతం : శేఖర్ చంద్ర (Shekhar Chandra)
సాహిత్యం: భాస్కర బట్ల రవి కుమార్ (Bhaskara Batla Ravi Kumar)
గాయకుడు: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.