దీపాల కాంతుల్లో దగ దగ మెరిసేవయ్యో మా దయగల్ల అంజన్న
ఆ కొండగట్టు కొండ మీద కోటి మాయల మా అంజన్న ( 2)
పచ్చ పచ్చని కొండల్లో పరమాత్ముడవైనవయ్యో మా పవన తనయ అంజన్న
పదిలంగా వెలిసావయ్యో మా కొండగట్టు అంజన్న (2)
నిన్ను నమ్మిన భక్తులకు నిండు పున్నమి వెలుగై మా దండి దేవుడా అంజన్న
వెలుగులు పంచినావో మా జిలిబిలి నగవుల అంజన్న (2)
నీ కొండా జేరే భక్తులకు అండగా నీవున్నావో మా కొండగట్టు అంజన్న
మహా దండిగా నీవున్నావో అంజని తనయ అంజన్న (2)
రాముని నామం తలువంగా రక్షించే దేవుడవో మా రామ ధూత అంజన్న
కాపాడే దేవుడవో మా సింధూర రూప అంజన్న (2)
గండ దీపం వెలిగించంగా గ్రహ బాధలు తొలిగించేవో
మా గండిలా వెలిసిన హనుమన్న
అండగా నువ్వుండేవయ్యో మా అంజని పుత్ర అంజన్న (2)
నీ పేరే తలువంగా భూతాలే వణికేనయ్యో మా చందన తేజ అంజన్న
దెయ్యాలే దద్దరిల్లో మా దండి వీర అంజన్న (2)
నీ మాలే వెయ్యంగా మా భయములు అన్ని తొలగో
మా వానర వీర అంజన్న శక్తి యుక్తులు కలుగో
మా వజ్రకాయుడా అంజన్న (2)
ఏ అతులిత బలధాముడవై అవని నేలుతున్నవో మా అంజని తనయ అంజన్న
పుడమిని కాస్తున్నావో మా పుణ్యవీరుడా అంజన్న (2)
నిన్నే నమ్మిన జీవులమయ్యా నిత్యం అండగా ఉండో మా దండి వీరుడా అంజన్న
కలకాలం తోడుగా ఉండో మా కరుణ గల్లా అంజన్న (2)
దీపాల కాంతుల్లో దగ దగ మెరిసేవయ్యో మా దయగల్ల అంజన్న
ఆ కొండగట్టు కొండ మీద కోటి మాయల మా అంజన్న ( 2)
పచ్చ పచ్చని కొండల్లో పరమాత్ముడవైనవయ్యో మా పవన తనయ అంజన్న
పదిలంగా వెలిసావయ్యో మా కొండగట్టు అంజన్న (2)
దగ దగ మెరిసేవయ్యో మా దయగల్ల అంజన్న
ఆ కొండగట్టు కొండ మీద కోటి మాయల మా అంజన్న (2)
________________________
Song Credits:
పాట పేరు: దీపాల కంతుల్లో (Deepala Kanthullo)
గాయకుడు: ఆకునూరి దావయ్య (Akunuri Davaiah)
సాహిత్యం: జడల రమేష్ (Jadala Ramesh)
సంగీతం: జడల రమేష్ (Jadala Ramesh)
See Also plz click on this: o-na-ramayya-song-lyrics-nalgonda-gaddar
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
