Home » నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు భజన పాట లిరిక్స్

నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు భజన పాట లిరిక్స్

by Lakshmi Guradasi
2.4K views
nalla nallani vadu namalu galla vadu lyrics

నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు
నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు
ఆ ఏడు కొండల్లోన కొలువై ఉన్నవాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల

అలిపిరి కొండ కాడ అభయాన్నే ఇచ్చువాడు
అడుగు దండాలవాడు శ్రీవేంకటేశుడు
శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల

శేషాద్రి కొండల్లోన పవళించి ఉన్నవాడు
వడ్డీ కాసుల వాడు వడ్డీ పట్టి లాగేటోడు
మోకాళ్ళ కొండ కాడ మోక్షాన్నే ఇచ్చువాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల

అంతెత్తు కొండల్లోన అగుపడని తావుల్లోనా
కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు
శ్రీ లక్ష్మీ నాథుడు సిరిగల్ల దేవుడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల

నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు
నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు
ఆ ఏడు కొండల్లోన కొలువై ఉన్నవాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.