Home » పచ్ఛా పచ్చని చెట్టురా (Pacha pachani chettura) Ayyappa పాట లిరిక్స్

పచ్ఛా పచ్చని చెట్టురా (Pacha pachani chettura) Ayyappa పాట లిరిక్స్

by Lakshmi Guradasi
2.8K views
Pacha pachani chettura song lyrics

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా

నీ స్వామి నామమే పలుకురా

ఒకానొక రోజున చిలక నాసెంతకు వచ్చెరా
స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా

ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే
ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తల పెట్టి వెక్కి వెక్కేడ్చింది

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా
పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా

చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచి పోయినయి

చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచి పోయినయి
అట్టి ఆ జంటను బోయవాడు చూచెను
చిలకమ్మను చూసి విల్లు ఎక్కుపెట్టెను
అది చూచి గోరింక చిలక కడ్డువచ్చెరా
గోరింక కంటికి గాయమైనాదిరా
గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా
పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా

గాయమైన గోరింకకు అన్ని తానైనది
తన కంటితోని లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజ చూచెను
పూజలోన గురుస్వామి మహిమలెన్నో చెప్పెను

గాయమైన గోరింకకు అన్ని తానైనది
తన కంటితోని లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజ చూచెను
పూజలోన గురుస్వామి మహిమలెన్నో చెప్పెను

నడవలేని వారు కొండనడిచి వెళ్లారని
మాటరానివారు పాట పాడుతున్నారని
చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా
పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా

అట్టియా రామ సిలక స్వామి మాల వేయమని
నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది
మండల వ్రతమును మరువక జేతునని
తన ఇరుముడిని నా తలమీద ఉంచమని

అట్టియా రామ సిలక స్వామి మాల వేయమని
నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది
మండల వ్రతమును మరువక జేతునని
తన ఇరుముడిని నా తలమీద ఉంచమని

ఇరుముడిలోన తను గోరింక వచ్చునని
మహిమల మణికంఠుని కనులారగాంతుమని
ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
రామసిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా

పచ్ఛా పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలుకరా
చెట్టు మీద రామచిలుకరా చెట్టు మీద రామచిలుకరా

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.