Home » నీ ఆజ్ఞ లేనిదే స్వామి (Ni agna lenide) సాంగ్ లిరిక్స్

నీ ఆజ్ఞ లేనిదే స్వామి (Ni agna lenide) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
4.8K views
ni agna lenide swamy lyrics vagdhevi

నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమి..
నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టే లేదంట ఏమి..
కన్నోళ్లు ఎవరు లేరయ్య నాకు..
కన్నీళ్లు తుడిచే వారెవరు రారు.. నమ్మయ్య నా మాటా..

నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమి..
నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టే లేదంట ఏమి..

సిగలో గంగమ్మ చెవిలోన చెప్పదా
కాలయముల మధ్య పసికూన నైన అని
మెడలోనా నాగమ్మ బుస విప్పి చెప్పదా
ఆడపిల్ల బతుకు అరిటాకు చందమని

ఏ మట్టి ఇంటికి నేను స్వామి సూట్టన్ని అసలే కాను..
నాకేం బాధలు ఉన్నా నంది చెవులోనే చెబుతూ ఉన్నా..
నిన్ను కోలుచుకుంటా నా గుండె నిండా
కాపాడవయ్య నా ఎండికుండా
వినవయ్య ఈశ్వరా…

నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమి..
నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టే లేదంట ఏమి..

పురిటిలోన అమ్మనాన్నలను నేను
పొట్టనెట్టుకున్న నింద మోస్తున్న..
అయినా వాళ్ళు నన్ను అనారని మాట అన్న..
ఆత్మ నిండా నేను నిను నమ్ముకున్న..
కోరలు చాచిన నరులు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు..

ఎట్టా చేసెదయ్య..నేను ఎట్టా బ్రతికేదయ్య..
నా బాధలిప్పుడు తొలగించవయ్య..
నీ చెంత చేరి కొలిచినానయ్య..
కాపాడు నా స్వామి..

నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమి..
నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టే లేదంట ఏమి..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.