Home » కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు సాంగ్ లిరిక్స్

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.3K views
Kanneswamulocharu Katthiswamulocharu song lyrics

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారు గదాస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారు గదాస్వాములొచ్చారు

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారు గదాస్వాములొచ్చారు
ఏడ దాగి..స్వామి..ఏడ దాగి అయ్యా..
ఏడ దాగి ఉన్నావయ్యో అయ్యప్ప ఒక్కసారి కానరావో అయ్యప్ప
ఏడ దాగి ఉన్నావయ్యో అయ్యప్ప ఒక్కసారి కానరావో అయ్యప్ప

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు

మలయాళ దేశములో అయిదు కొండల నడుమ
మలయాళ దేశములో అయిదు కొండల నడుమ
శబరిమల కొండల్లో కొలువుతీరి ఉన్నావా..
శబరిమల కొండల్లో కొలువుతీరి ఉన్నావా..

మలయాళ దేశములో అయిదు కొండల నడుమ
శబరిమల కొండల్లో కొలువు తీరి ఉన్నావా…
ఏ కొండలో స్వామి…ఏ కొండలో అయ్యా…
ఏ కొండలో ఉన్నావయ్యో అయ్యప్ప ఎక్కడని వేతకాలయ్యో అయ్యప్ప
ఏ కొండలో ఉన్నావయ్యో అయ్యప్ప ఎక్కడని వేతకాలయ్యో అయ్యప్ప

తులసిమాల మెడలో వేసి నీ దీక్ష ని పూనుకొని
తులసిమాల మెడలో వేసి నీ దీక్ష ని పూనుకొని
నలుబది రోజుల మండల పూజలే చేసుకొని
నలుబది రోజుల మండల పూజలే చేసుకొని

తులసిమాల మెడలో వేసి నీ దీక్ష ని పూనుకొని
నలుబది రోజుల మండల పూజలే చేసుకోని
ఇరుముడిని స్వామి…ఇరుముడిని అయ్యా…
ఇరుముడిని కట్టుకోని అయ్యప్ప నీ చెంతకు బైలెళ్లినం అయ్యప్ప
ఇరుముడిని కట్టుకోని అయ్యప్ప నీ చెంతకు బైలెళ్లినం అయ్యప్ప

కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
గంట స్వాములొచ్చారుగదాస్వాములొచ్చారు..

ఎరుమేలి చేరుకోని వేషాలు వేసుకోని
ఎరుమేలి చేరుకోని వేషాలు వేసుకోని
ధర్మశాస్త రూపానికి దండాలు పెట్టుకోని
ధర్మశాస్త రూపానికి దండాలు పెట్టుకోని

ఎరుమేలి చేరుకోని వేషాలు వేసుకోని
ధర్మశాస్త రూపానికి దండాలు పెట్టుకోని
పేటతుళ్లి స్వామి…పేటతుళ్లి అయ్యా…
పేటతుళ్లి ఆడినాము అయ్యప్ప అడవిబాట పట్టినాము అయ్యప్ప
పేటతుళ్లి ఆడినాము అయ్యప్ప అడవిబాట పట్టినాము అయ్యప్ప

కాలిఘటం చేరుకోని కరములెత్తి మొక్కుకోని
కాలిఘటం చేరుకోని కరములెత్తి మొక్కుకోని
అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకోని
అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకోని

కాలిఘటం చేరుకోని కరములెత్తి మొక్కుకోని
అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకొని
రెండు రాళ్లు…స్వామి…రెండు రాళ్లు…అయ్యా…
రెండు రాళ్లు తీసుకోని అయ్యప్ప మహిషి మీద పెట్టినాము అయ్యప్ప
రెండు రాళ్లు తీసుకోని అయ్యప్ప మహిషి మీద పెట్టినాము అయ్యప్ప

కన్నెస్వాములొచ్చారుకత్తిస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారుగదాస్వాములొచ్చారు

కరిమలా కొండను కష్టపడి దాటినాము
కరిమలా కొండను కష్టపడి దాటినాము
పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము
పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము

కరిమలా కొండను కష్టపడి దాటినాము
పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము
కన్నెమూల…స్వామి..కన్నెమూల..అయ్యా..
కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినం అయ్యప్ప
కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినం అయ్యప్ప

శరణుగుత్తి యాలి చేరి శరణాలు బెట్టినాము
శరణుగుత్తి యాలి చేరి శరణాలు బెట్టినాము
శబరిమాత పీఠానికి శిరస్సువంచి మొక్కినాము
శబరిమాత పీఠానికి శిరస్సువంచి మొక్కినాము

శరణుగుత్తి యాలి చేరి శరణాలు బెట్టినాము
శబరిమాత పీఠానికి శిరస్సువంచి మొక్కినాము
పద్దెనిమిది …స్వామి…పద్దెనిమిది..అయ్యా…
పద్దెనిమిది మెట్లు ఎక్కినం అయ్యప్ప కనులారా నిన్ను చూసినం ఆయప్ప
పద్దెనిమిది మెట్లు ఎక్కినం అయ్యప్ప కనులారా నిన్ను చూసినం ఆయప్ప
పద్దెనిమిది మెట్లు ఎక్కినం అయ్యప్ప కనులారా నిన్ను చూసినం ఆయప్ప
పద్దెనిమిది మెట్లు ఎక్కినం అయ్యప్ప కనులారా నిన్ను చూసినం ఆయప్ప

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.