duke dhairyama jagratta song lyrics devara part 1

దూకే ధైర్యమా జాగ్రత్త సాంగ్ లిరిక్స్ – దేవర పార్ట్ – 1

by Rahila SK

అగ్గంటుకుంది సంద్రం
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయ్యే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా

దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
భయమున దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే


పాట: దూకే ధైర్యమా జాగ్రత్త
చిత్రం: దేవర పార్ట్ – 1 (2024)
తారాగణం: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్
గాయకులు: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

ఆయుధ పూజ ( Ayudha Puja) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara)

దావుడి (Daavudi) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like