దండాలు దండాలు అమ్మోరు తల్లో (Dandalu dandalu) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

మాయమర్మమెరగనోళ్ళం
మట్టి పిసికి బతికెటోళ్ళం

ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం
గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము
బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో
పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో
ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో…

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే
ఏయ్ సకల లోకాలేలు సర్వమంగళి నేనే
బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ
నిడదోలు సత్తెమ్మ నేనే

ఏయ్ అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు
అన్నూళ్ళ దేవతను నేనే
మీ బాధలను తీర్చి మీకోర్కెలీడేర్చి
అలరించి పాలించు అమ్మోరు నేనే…

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

పాదులేని తీగకు పందిరేసిన తల్లివి
మోడుబారిన రేమ్మకు పూలు తొడిగిన అమ్మవి
ఆపదలు పోగొట్టి కాపురము నిలబెట్టి
కరుణించి కాపాడినావు

అరుదైన వరములను అనుకోని శుభములను
నా బ్రతుకుపై చల్లినావు
ఈలాగే నీ అండే ఎప్పటికీ నాకుంటే
లోకంలో సుఖమంతా నాకే వశమౌతుంది

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో
చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో

In English Version:

Maaya marmameraganollam
Matti pisiki batiketollam

Oori devathaina ninne oopiriga kolisetollam
Gandavaram neygi posi garelonde techhinaamu
Bujjimunda kallukunda ventabettukochhinaamu

Dandalu dandalu ammoru tallo
Shatakoti dandalu maayamma tallo
Pottellu techhaamu ammoru tallo
Pongallu pettamu maayamma tallo
Aaraginchi mammelu ammoru tallo…

Dandalu dandalu ammoru tallo
Shatakoti dandalu maayamma tallo

Aadishaktini nene Annapurnanu nene
Ey sakala lokaalelu sarvamangali nene
Bejawada Durgamma Telangana Ellamma
Nidadolu Sattemma nene

Ey Alluru Kalluru Aaleru Seeleru
Annulla devathanu nene
Mee baadhalanu theerchi me kokkelidurchi
Alarinchi paalinchu ammoru nene…

Dandalu dandalu ammoru tallo
Shatakoti dandalu maayamma tallo

Paaduleni theegaku pandiresina tallivi
Modubaarina remmaku poolu thodigina ammavi
Aapadhalu pogotti kaapuramu nilabetti
Karuninchi kaapaadinavu

Arudaina varamulanu anukoni shubhamulanu
Naa bratuku pai challinavu
Eelage nee ande eppatiki naakunte
Lokamlo sukhamantaa naake vashamautundi

Dandalu dandalu ammoru tallo
Shatakoti dandalu maayamma tallo
Karuninchi mammelu ammoru tallo
Challaga eeluko maayamma tallo

_____________

Song Credits:

సాంగ్: దండాలు దండాలు అమ్మోరు తల్లో (Dandalu dandalu ammoru thallo)
చిత్రం: అమ్మోరు (Ammoru)
గాయకులు: చిత్ర (Chitra), మనో (Mano)
గీతరచయిత: మల్లెమాల (Malle maala)
సంగీతం: శ్రీ కొమ్మినేని (Sri Kommineni)
దర్శకుడు: కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like