తొలకరి సినుకువై నను తాకంగా
సక్కని మనసే నిను కోరంగా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నీ గాలి సోకి నే పొంగిపోగా
నా ప్రేమ కాస్త నీవైపే మల్లంగా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
బావ బావ అంటూ నన్నే పిలవంగా
నాలో ప్రాణమంతా నువ్వే అయ్యావే
అంతులేని సంతోషమయ్యావే
అందమైన నా లోకమయ్యావే..
తొలకరి సినుకువై నను తాకంగా
సక్కని మనసే నిను కోరంగా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నీలోన మంచి దాగున్న విషయాలు
నా లోన ప్రేమ బావాలు పలికించే
నీ చుట్టే నన్ను తిరిగేలా చేశాయిలే
చేశాయిలే
ఎంత పొగిడిన తక్కువేమి ప్రేమకు
అంత గొప్పా నీ మంచి మనసుకు
దూరమే పెట్టి భారం అవుతానా
నీ మాటకు
ఓ అందాల నెలవంక నీ పరువాల సొగసుకు
నే వశమైపోయాను గా కొత్తగా
నీ చూపులే పడ్డాక నా పరువాల సొగసింక
నీ సొంతమైపోయింది గా పిల్లాడ
తొలకరి సినుకువై నను తాకంగా
సక్కని మనసే నిను కోరంగా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నీ గాలి సోకి నే పొంగిపోగా
నా ప్రేమ కాస్త నీవైపే మల్లంగా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
కాలమే నన్ను నడిపిన తీరు
నీ ప్రేమనే నేను పొందానుగా
ఆ బ్రహ్మకే నేను రుణపడివుంటాను
నా కోసమే నిను పంపాడు గా
గుండెల్లో నీ దాగున్న ప్రేమంతా
మాటల్లోనే చూపించావు గా
అడుగడుగూ నా తోడుగ నువ్వుంటూ
ధైర్యమే నాలో నింపావు గా
నా ఆడుగుజాడలో నువ్వు నీ ప్రేమబాటలో నేను
ఒక్కటై మనబందాన్ని కాపాడుకుందామా
నీ అడుగుజాడలో నేను నా ప్రేమ బాటలో నువ్వు
ఒక్కటై మానబందాన్ని కొనసాగిద్దాము
తొలకరి సినుకువై నను తాకంగా
సక్కని మనసే నిను కోరంగా
నువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా
నీ గాలి సోకి నే పొంగిపోగా
నా ప్రేమ కాస్త నీవైపే మల్లంగా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
నువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకా
👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!