Home » రాత్రంతా రచ్చే సాంగ్ లిరిక్స్ – షష్టిపూర్తి

రాత్రంతా రచ్చే సాంగ్ లిరిక్స్ – షష్టిపూర్తి

by Vinod G
696 views
rathrantha rache lyrical song shashtipoorthi

రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి విచ్చే
చూస్తే పడతా చేస్తే చెడతా కట కటా
పదా దోస్తీ కడతా కుస్తీ పడతా వలపు వాకిటా

హే రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి విచ్చే

రాసిస్తా రాజ్యాలే కొత్త కొత్తగా
నను ఊరించే వయ్యారి ప్రేమ గుర్తుగా
ఆకల్లా ఆకళ్ళు వెల్లువెత్తగా
ఇక వడ్డిస్తా అందాలు వెచ్చ వెచ్చ గా

పరువమా పరువమా పడుచు ప్రాయమా
పలుకుమా కులుకుమా చిలిపి గేయమా
వల వేస్తా శాస్తే చేస్తా లే విరుల పక్కనే వేస్తూ
రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి విచ్చే

హు పూయిస్తా అందాలే మెత్త మెత్తగా
సిరి వెన్నెల్లో పున్నాగ కన్నె సాక్షిగా
ఆ వల్లే అల్లాడే ముద్దు ముద్దుగా
నను మోజుల్లో ముంచేసే మత్తు మత్తుగా
ఇది కదా మన కథ ముసిరే కోరికా
హే తరలిరా తపనవై తలుపు తారక
మరి కాస్తో కూస్తో దోస్తాలే వలపు గుట్టునే మోస్తూ

రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి విచ్చే
చూస్తే పడతా చేస్తే చెడతా కట కటా
పదా దోస్తీ కడతా కుస్తీ పడతా వలపు వాకిటా

రా రా రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే పిచ్చే పిచ్చే
నీ మాటే నచ్చే మది మరుమల్లెయి విచ్చే


పాట పేరు: రాత్రంతా రచ్చే (Rathrantha Rache)
సినిమా పేరు: షష్టిపూర్తి (Shashtipoorthi)
గానం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), నిత్యశ్రీ వెంకట్రామణన్ (Nithyasree Venkatramanan)
సాహిత్యం: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: పవన్ ప్రభ (Pavan Prabha)
తారాగణం: రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) రుపేష్ (Rupeysh), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.