Home » వాడపల్లి వెంకన్నను ఏడు శనివారాలు దర్శిస్తే కోరిక తీరాల్సిందే! | Vadapalli Venkateswara Temple History

వాడపల్లి వెంకన్నను ఏడు శనివారాలు దర్శిస్తే కోరిక తీరాల్సిందే! | Vadapalli Venkateswara Temple History

by Lakshmi Guradasi
1.2K views
vadapalli venkateswara temple history seven saturdays wish fulfillment

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా   ఆత్రేయపురం మండలం, వాడాపల్లిలో కొలువై ఉంది. ఎర్ర చందనం కొయ్యలో వెలసిన స్వయంభు క్షేత్రం ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 

ఇక్కడ స్వామి వారు రాయిలో కాకుండా ఒక్క చెక్కలో స్వయంభువుగా కొలువై ఉన్నారు. నారద మహర్షి వెంకటేశ్వరునిగా నామకరణం చేసి తన స్వహస్తాలతో ప్రతిష్టించిన విగ్రహమే వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఈ క్షేత్రాన్నే కోనసీమ తిరుపతి అని కూడా అంటారు.

Vadapalli Venkateswara Temple

ఆలయ విశేషాలు:

ఈ క్షేత్రంలోని మూల విరాటు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ 7 వారలు శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కల్యాణ వెంటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. 

వాడపల్లి ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. మరియు విశాలమైన ప్రాగణంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఆలయం చుట్టూ ఉన్న పై కప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది. ఇది ప్రదక్షిణాలు నిర్వహిస్తున్నప్పుడు భక్తులు వాటిని పాఠించడానికి సహాయపడుతుంది. ప్రతి శనివారం ఆలయానికి అరకిలోమీటరు దూరంలో మేళ అంటే జాతర స్టాల్లు ఏర్పాటు చేస్తారు. 

వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎర్ర చందనంలో ఉంటుంది. అందుకే  స్వామి వారికీ పంచామృత అభిషేకాలు చెయ్యరు. కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు. 

ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం…. 

పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి నది నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహా విష్ణువే వేంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలిశారు.

వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. నది ఒడ్డున వెలిసిన స్వామివారిని నారద మహర్షివారు కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది. 

ఇది ఇలా ఉండగా… ఈ ప్రాంతంలో పినుపోతుల గజేంద్రుడు అనే నొకవ్యాపారి ఉండేవారు.  అయన చాలా ఓడలకు అధిపతి. ఒక్కసారి సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయ్. దింతో తన ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకువొస్తే, నదిలో ములిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి కొత్త దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పేరంట. తుపాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దింతో గజేంద్రుడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారని ఇక్కడ ఉన్న స్థానిక శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం 1759 సంవత్సరంలో జరిగింది. గజేంద్రుడు ఆలయానికి 275 ఎకరాల భూమి, విలువైన ఆభరణాలు విరాళంగా ఇచ్చారట. 

ఉప ఆలయాలు: ఈ ఆలయంలో స్వామివారి  కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలు మంగతాయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామునుజులవారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. 

ఉత్సవాలు మరియు భక్తి:

స్వామి వారికి ఇక్కడ 10 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే వివాహితులకు వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

భక్తులు వాడపల్లి వెంకన్నను ఏడుసార్లు శనివారం దర్శిస్తే, వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. ఈ కారణంగా ప్రతి శనివారం వాడపల్లి ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ ఆలయం తిరుపతి తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఒకటిగా పేరొందింది. 

కోనసీమ తిరుపతిగా కూడా ప్రసిద్దిగాంచిన వాడపల్లి తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం పట్టణానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 

మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.