ambarana garuda pakshi song lyrics

అంబరాన గరుడ పక్షులాడి పాడెను లిరిక్స్ | Ambaraana Garudapakshi Aadipadunu lyrics

by Lakshmi Guradasi

Ambaraana Garudapakshi Aadipadunu lyrics

స్వామియే శరణమయ్యప్ప!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
స్వామి.. అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

అలంకార ప్రియునికి ఆభరణాలొస్తుంటే..
అలంకార ప్రియునికి ఆభరణాలొస్తుంటే..
అడవితల్లి పూలు జల్లి అమ్మవోలె సాగనంపె..
అంబరాన.. భలే భలే అంబరాన.. స్వామి!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

కొత్తపాట నేర్చినట్టు కోకిలమ్మ రాగాలు..
కొత్త చుట్టమొచ్చినట్టు కాకియమ్మ సరాగాలు..
ఆ.. కొమ్మ మీద రామచిలుక కమ్మనైన పలుకులు..
పొదల కింద గోరింకల పొర్లు పొర్లు దండాలు..
అంబరాన.. స్వామి అంబరాన.. అయ్యా!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

స్వామియప్పా.. అయ్యప్పా!
శరణమప్పా.. అయ్యప్పా!
స్వామియే.. అయ్యప్పో! అయ్యప్పో.. స్వామియే!

గాండ్రింపులు గాలి కొదిలి పులిరాజుల పూజలు..
చెంగు చెంగున దుంకులాడి చెవులపిల్లుల సేవలు..
నాగస్వరమూదినట్టు నాగన్నల ఆటలు..
భజంత్రీలు మోగినట్టు పింగాన్నల మోతలు..
అంబరాన.. ఆ.. అంబరాన భలే!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

స్వామియప్పా.. అయ్యప్పా!
శరణమప్పా.. అయ్యప్పా!
శరణమప్పా.. అయ్యప్పా!
కాపాడప్పా.. అయ్యప్పా!

గణ గణ గణ గంటలతో గజరాజుల గంతులు..
కేరళ వాయిద్యాల్లో జింకల కేరింతలు..
కూచిపూడి నాట్యాల కులికె నెమలి పిల్లలు..
పాల నురగ లోలె పొంగే పంబ నది పరవళ్ళు..
అంబరాన.. ఆ.. అంబరాన.. స్వామి!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

అలంకార ప్రియునికి ఆభరణాలొస్తుంటే..
అలంకార ప్రియునికి ఆభరణాలొస్తుంటే..
అడవితల్లి పూలు జల్లి అమ్మవోలె సాగనంపె..
అంబరాన.. ఆ.. అంబరాన స్వామి!
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..
అంబరాన గరుడ పక్షులాడి పాడెను..
సంబరాన మణికంఠుని నగలు చేరెను..

___________________

Read Also: shivudantaru harudantaru song lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like