ee roje telisindi song lyrics idiot

ఈ రోజే తెలిసింది(Ee Roje Telisindi) లిరికల్ సాంగ్ – ఇడియట్ (Idiot)

by Vinod G

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువో
నను చేరే పన్నీరువో
నీ ఎద చాటు వలపెంతో తెలిసింది రా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

కన్నులలోన వెన్నెలలోన నీ రూపు తోచే
ఊహలలోన ఊసులలోన నీ ఆశలే
నాలో నీ బాసలే
తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తోంది తనువంతా
అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై నాలో అనుబంధమై
నీ ప్రేమ నను చేరి ఉడికించెరా
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

ఏయ్ ఏంటలా చూస్తున్నావ్ సిగ్గేస్తుంది
దగ్గరికి రావద్దే ప్లీజ్ చంటి నిన్నే అరేయ్

ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై నిను తాకనా
నీలో సడి చేయనా
పని చేస్తే పక్కన చేరి సందడి చెస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై
నీ ప్రేమ కలలెన్నో పండించెరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన
నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువో
నను చేరే పన్నీరువో
నీ ఎద చాటు వలపెంతో తెలిసింది రా


పాట పేరు: ఈ రోజే తెలిసింది(Ee Roje Telisindi)
సినిమా పేరు: ఇడియట్ (Idiot)
గానం: కౌసల్య (Kausalya)
సాహిత్యం: కంది కొండ (Kandi Konda)
సంగీతం: చక్రి (Chakri)
రచయిత & దర్శకుడు: పూరి జగన్నాధ్ (Puri Jagannadh)
తారాగణం: రక్షిత (Rakshita), రవితేజ (Ravi Teja) తదితరులు

ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి, తెలుగురీడర్స్

You may also like