ఏమ్ చేశావో ఏమో (Yem Chesavo Emo) సాంగ్ లిరిక్స్ – Crime Reel

by Lakshmi Guradasi

ఉన్నానో లేనో నీలోన నేను
తెలిసేదెలాగో ఏమో
విన్నావో లేదో
లోలోన నన్ను
అడిగేదెలాగో ఏమో
కాలం గడిపేస్తున్నాను
మౌనం నేర్చుకుంటూ
పాదం నడిపిస్తునాను
ప్రాణమా… నీ చుట్టూ

ఏమ్ చేశావో ఏమో
ఏం చెయ్యాలో ఏమో
ప్రేమ పుట్టిందంటే ఇంతేనేమో
ఏమ్ దాచాలో ఏమో
ఏం చెప్పాలో ఏమో
ప్రేమ కుట్టిందంటే ఇంతేనేమో

రాజా వారి రాణి నువ్వై
ఉంటే చాలే నా గుండెల్లో
రాత్రి పగలు గడిపేస్తాలే
మురిపించేటి నీ మాటల్లో

అరెరే ఎంత మారమో
ఇంత మీదనా
మురిసిపోతూ నాలో నేనుగా
తేలని హాయిలో..

అరెరే ఎంత వెతికానో
ఎంత దూలికానో
అంతు చిక్కలేదు బొత్తిగా
తేలుతూ ప్రేమలో..

ఏమ్ చేశావో ఏమో
ఏం చెయ్యాలో ఏమో
ప్రేమ పుట్టిందంటే ఇంతేనేమో
ఏమ్ దాచాలో ఏమో
ఏం చెప్పాలో ఏమో
ప్రేమ కుట్టిందంటే ఇంతేనేమో

గుస గుసలాడే ముసి ముసినవ్వే
విన్న విన్న నీ అందెలలో
కుహు కుహుపాడే పదానిసాలెన్నో
వింటూ వున్నా ఆ సందడిలో

నువ్వు నా చెంత వాలాకే
చేతిలో రేఖ మారిపోతూవుంది వింతగా
ప్రాయం సడిచేయగా..

అటుపై కొంత నీలాగా
కొంత నాలాగా
ఎంత ఎంత దూరమెల్లినా
ప్రాణం విడిపోదుగా..

ఏమ్ చేశావో ఏమో
ఏం చెయ్యాలో ఏమో
ప్రేమ పుట్టిందంటే ఇంతేనేమో
ఏమ్ దాచాలో ఏమో
ఏం చెప్పాలో ఏమో
ప్రేమ కుట్టిందంటే ఇంతేనేమో

__________________________________________________________

చిత్రం: క్రైమ్ రీల్ (Crime Reel)
రచయిత – దర్శకుడు – సంజన అన్నే (Sanjana Anne)
నిర్మాత – ధన కోటేశ్వరరావు అన్నే (Dhana Koteswara Rao Anne)
సినిమాటోగ్రాఫర్ – బాబు కొల్లాబత్తుల (Babu Kollabathula)
సంగీత దర్శకుడు – సోమిశెట్టి రాజేష్ (Somisetty Razesh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like