Home » ఆగస్టు 15 నుంచి వందే భారత్ లో స్లీపర్ కోచ్!

ఆగస్టు 15 నుంచి వందే భారత్ లో స్లీపర్ కోచ్!

by Shalini D
0 comment

మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160-220 కి.మీ వరకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మనకు స్లీపర్ కోచ్ చాలా అవసరం. ఎందుకంటే.. దూర ప్రయాణాలు ఎక్కువే. పైగా వందే భారత్ రైళ్లు కూడా ఈమధ్య టైమ్ ప్రకారం నడవట్లేదు. అవి కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి. వాటి యావరేజ్ వేగం తగ్గిందని కేంద్రమే చెప్పింది. అందువల్ల స్లీపర్ రైళ్లు వస్తేనే మనకు బెటర్‌గా ఉంటుంది.

ఇందులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. వాటిలో 10 థర్డ్ క్లాస్ ఏసీకి, 4 సెకండ్ క్లాస్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ క్లాస్ ఏసీకి కేటాయిస్తారు. సీటింగ్ తోపాటు లగేజీ కోసం (SLR) రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి

You may also like

Leave a Comment