Home » ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై వచ్చిన ప్రచారాలు అవాస్తవం అని చెప్పిన రైల్వే శాఖ

ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై వచ్చిన ప్రచారాలు అవాస్తవం అని చెప్పిన రైల్వే శాఖ

by Nikitha Kavali
0 comment

ఇటీవల సామజిక మాధ్యమాలలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై వస్తున్న ప్రచారాలు అవాస్తవమని అందులో ఎటువంటి నిజాలు లేవని రైల్వే శాఖ నిర్దారించింది. ఒకే ఐడి తో కుటుంబ సభ్యులకు, రక్త సంబంధీకులకు తప్పిస్తే స్నేహితులకు కానీ బయటి వారికీ కానీ టికెట్ బుక్ చేస్తే వారికీ బారి జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుంది అనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది.

కానీ అందులో ఎటువంటి నిజాము లేదని రైల్వే శాఖ తేల్చి చెప్పేసింది. ఒకే ఐడి తో ఎవరికైన టికెట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పింది.

ఒకవేళ పర్సనల్ ఐడి లతో బుక్ చేసిన టిక్కెట్లతో ఏమైనా వాణిజ్య పరమైన కార్యక్రమాలకు గాని పాల్పడితే అప్పుడు 144 ప్రకారం వారికీ చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని రైల్వే శాఖ నిర్దారించింది.

ఒకే ఐడి తో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ ఐడి ఆధార్ తో అనుసంధానం అయి ఉంటె అప్పుడు నేలకు 24 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment