నీ కమ్మని కన్నులోన వరుడే ఎవరమ్మా
నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా
నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే చెప్పమ్మా
నడి రాతిరి చంద్రుడే వాడయడోయమ్మా
రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుంది
తన నిదురను దోచేసే రూపం నీదయింది
రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుంది
నా నిదురను దోచేసే రూపం నీదయింది
నేనేందిరో ఉన్న నా సుందరి కనపడుతుంది
ఎద హత్తుకునే సమయం రానే వచ్చేసింది
ఏడడుగుల జీవితమో ఎద పలికే సంగతేమో
ఏ జన్మలో పుణ్యమో ఏనాటిదో ఈ బంధమో
నీ తోడే కావాలి గడిసేటి గడియైనా
నీ చెయ్యి వదలనులే చావైనా బతుకైనా
రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుంది
నా నిదురను దోచేసే రూపం తనదయింది
నా అడుగులో అడుగేసే అలకైనా అందంగుంది
అరచేతిని పట్టుకునే అదృష్టం అయింది
నీ మాటలు వినకుండా కునుకైనా రానంటుంది
నువ్వు ఎదురుగా నిలబడితే ఏదేదో అవుతుంది
ఓ పలుకుల చిలకమ్మా
నిను కోరిన ఈ జన్మ
మాట్లాడే సిరిబొమ్మ
నా బతుకంతా నీకమ్మా
కుదురుగా నేనుండనులే నిను కలిసే వరకు
కాలాన్నే ముందుకు తోయన నా చెలి నీ కొరకు
రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుంది
తన నిదురను దోచేసే రూపం నీదయింది
నీ కమ్మని కన్నులోన వరుడే ఎవరమ్మా
నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా
నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే చెప్పమ్మా
నడి రాతిరి చంద్రుడే వాడయడోయమ్మా
ఆ నింగిలో వెన్నెల నా గుండెకు దిగి వచ్చింది
వందేళ్ళు నీతోనే అని వరమే ఇచ్చేసింది
నా చేతిలో నీ పేరే గోరింటాకే రాసింది
నీ వేలిని పట్టుకొని క్షణమే వచ్చేసింది
ఆ దేవుడు సాక్షిగా పూజిస్తా దేవతగా
నా మనసే మేడగా వెంటుంటానే నీ నీడగా
మన పెళ్లి సందడిలోనే చిందులు వేస్తూన్నా
నీ జతనే కావాలే ఇంకో వెయ్యేలైన
రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుంది
నా నిదురను దోచేసే రూపం తనదయింది
నువ్వు పక్కన లేకుంటే
క్షణమే ఒక యుగమవుతుంది
ప్రతి నిమిషం నీతోనే ఉండాలనిపిస్తుంది
నువ్వు దూరంగేళ్ళుతుంటే ఎద బారంగుంటుంది
నీ నవ్వుకి కారణమే నేనవ్వాలని ఉంది
నీతోనే హాయిగా ప్రతిరోజు పండగ
ప్రేమిస్తా ప్రాణంగా నా ప్రపంచం నువ్వుగా
మరుజన్మే నాకుంటే నీకోసం పుడతానే
కాటిలో నీ తోడైన సంతోషంగా వస్తానే
_______________________
కంపోజ్ & సంగీతం – ఇంద్రజిత్ (Indrajitt)
గాయకులు – ఇంద్రజిత్ (Indrajitt ) & జయశ్రీ (Jayasree)
పిల్లల బృందగానం – ప్రద్న్య (Pradnya), మనోజ్ఞ (Manognya), వాగ్దేవి (Vagdevi)
సాహిత్యం – శ్రవణ్లైఫ్ఫెయిల్యూర్ (Sravan_life_failure)
కాన్సెప్ట్-స్క్రీన్ ప్లే & దర్శకత్వం – మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)
నటీనటులు – జాను లిరి (Janu lyri), అక్షిత్ మార్వెల్ (Akshith Marvel)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.