తరిమే ఆలోచన
ఉరిమే ఆలాపన
ఒదిగే నా మనసున
గురుతై నిలిచే
కరిగే సమయంతో నువ్వే
ఎదురై నిలబడితే
నాలో మొదలౌతుంది కంగారి
ఉంటే నీ వెంటే
ఏది గురితే రాదంట నాకే
ఏమౌతుందో నాకే
పలికే బంగారమా
కులుకే సింగారమా
కవితే రాసానే నెనెనే ఎదలో
తన ఊహలో కనబడుతున్న నేనే
నా ప్రాణంలో వినబడుతుంది తానే
చూసే కనులే ఏవో చేసే పనులే
ఏ మాట కామాటగా
వాలే కనులే నాలో తేలే కలలే
నేనే నువ్ నా నువ్వుగా
పలికే బంగారమా
కులుకే సింగారమా
కవితే రాసానే నెనెనే ఎదలో
కనిపిస్తుంటే కన్నుల నువ్వే నువ్వే
వేరే ఏది గురుతసాలే రాదంటే
చూసే కనులే ఏవో చేసే పనులే
ఏ మాట కామాటగా
వాలే కనులే నాలో తేలే కలలే
నేనే నువ్ నా నువ్వుగా
పలికే బంగారమా
కులుకే సింగారమా
కవితే రాసానే నెనెనే ఎదలో
————————————————–
పాట: పలికే బంగారమా (Palike Bangarama)
గాయకుడు: డింకర్ కల్వల (Dinker Kalvala )
సంగీత స్వరకర్త: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ (Priyadarshan Balasubramanian)
సాహిత్యం: బాలవర్ధన్ (Balavardhan)
దర్శకుడు – శ్వేత పివిఎస్ (Swetha PVS)
నటీనటులు – అరవింద్ కృష్ణ (Arvind Krishna), శోభిత రాణా (Shobhitta Rana)
నిర్మాత – విష్ణు రెడ్డి కోమళ్ల (Vishnu Reddy Komalla)
రచయిత – మోహన్ కె రాజు (Mohan K Raju)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.