పాట: జత కలిసే
సినిమా: శ్రీమంతుడు
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: సాగర్, సుచిత్ సురేసన్
జత కలిసే జత కలిసే
జగములు రెండు జత కలిసే
జత కలిసే జత కలిసే
అడుగులు రెండు జత కలిసే
జనమొక తీరు వీళ్ళకదొక తీరు
ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుడ్డినట్టు ఒక కలగంటు ఉన్నారు
ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
నలుపు జాడ నళుసైనా
అంటుకొని హృదయాలు
తలపులోతునా ఆడమగలని
గుర్తులేని పసివాళ్లు
మాట్లాడుకోకున్నా
మది తెలుపుకున్నా భావాలు
ఒకరికొకరు ఎదురు ఉంటె
చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరి
ఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన
ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీళ్లు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసి
ఎగిరిపోయెను ఈ లోకం
ఏకమైనా ఈ జంట కొరకు
ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి
తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్భుతాన్ని
అసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది
ఏడ తెగని సంబరంగా తేలినాను నేను ఇలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
ఎప్పుడో కలిసిన వారైయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరిని
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.