ఓ రాజా కుమార……
మాయేదో చేసావు మాదిగా డోరా
మంత్రాలు చేసినట్టైతాందిరా
మనసంతా ని వైపే గుంజుతాందిరా
రాజా కుమారా రా రా వరుడై
లంకాధిపతి శ్రీ రవాణాసురుడై
మాదిగ మహారాజ మా ఇంటికి అల్లుడై
ఓ రాజకుమార… దినాకు… దిన
మాయేదో చేసావు మాదిగా డోరా
మంత్రాలు చేసినట్టైతాందిరా
మనసంతా ని వైపే గుంజుతాందిరా
కాలికి గజ్జె కట్టి డప్పేమో జబ్బాకేసి
దారువుకొడుతుంటే చూడాలి రా
ని డప్పు సప్పుడుకు
నా గుండె సప్పుడు
ఏకమై లోకమే మరిచేరా
ఓ చిన్నవాడా… నా పిల్లగాడా
పచ్చబొటేసుకున్న నా గుండె కడా
అంబరీనెక్కిరారా నాది జాంబవుడా
ఓ రాజా కుమార…….
మాయేదో చేసావు మాదిగా డోరా
మంత్రాలు చేసినట్టైతాందిరా
మనసంతా ని వైపే గుంజుతాందిరా
నువాట్ల నవ్వితే మీసాలు దువ్వితే
గుండెల్లోన గుబులైతది
రోడెంట్ట నువ్వు రొమ్మిసురుకుంటూ పోతే
సింహమే నడిచినట్టుంటది
ఆరుఅడుగులా ఓ ఆజానుబావుడా
ఏడు అడుగులు నీతో వేస్తాను దేవుడా
తాళి కట్టి నన్ను అలీ గా చేసుకోరా
ఓ రాజా కుమార…….
మాయేదో చేసావు మాదిగా డోరా
మంత్రాలు చేసినట్టైతాందిరా
మనసంతా ని వైపే గుంజుతాందిరా
ఆ కోర మీసం నీ ధర కోసం
నేను బ్రతికేదే నీ కోసం
గుండెల్లో దైర్యం
గుప్పెట్లో సౌర్యం
తట్టుకోలేని బ్రహ్మచర్యం
రాజా కుమార నా బాధావినరా
ఏ జన్మకైనా నువ్వే పెనివిటివిరా
మనువాడి యేలుకోరా మాదిగ డోరా
ఓ రాజకుమార… దినాకు… దిన
మాయేదో చేసావు మాదిగా డోరా
మంత్రాలు చేసినట్టైతాందిరా
మనసంతా ని వైపే గుంజుతాందిరా
_____________________________________________________________________
పాట: మాదిగ డోరా (Madiga dhora)
సాహిత్యం: గిన్నారపు రాజ్‌కుమార్ (Ginnarapu rajukumar)
గాయకుడు : రోహిణి (Rohini)
సంగీతం : ప్రశాంత్ మార్క్ (Prashanth Mark)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.