Home » ఒక వేకువ (Oka Vekuva) సాంగ్ లిరిక్స్, పెదబాబు (Pedababu)

ఒక వేకువ (Oka Vekuva) సాంగ్ లిరిక్స్, పెదబాబు (Pedababu)

by Lakshmi Guradasi
373 views
Oka Vekuva song lyrics Pedababu

హర హర మహదేవ శంభో హర ఓం…
శుభకర శివానంద జగదీశ్వర ఓం…
ప్రణవాంశ శక్తి స్వరూపాయ ఓం….
ప్రళయాగ్ని సెగశిఖలనిటలాక్ష ఓం…

పల్లవి:
ఒక వేకువ దీపంతో …ఈ లోకం మేలుకొని…
ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని….
ముసి ముసి నవ్వుల …. విరిసిన పువ్వుల….
పల్లె ఘల్లుమందీ….
ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి…తలలు వంచుకుంది
హరి ఓం శాంతి శాంతి….
డమరుక నాద విశ్వశాంతి…
హరి ఓం శాంతి శాంతి….
డమరుక నాద విశ్వశాంతి…

భం చిక భం చిక చమ్ చక్క..
చక్కనమ్మ ముగ్గులెట్టె ఎంచక్కా…
పాడిపంట పొంగులాడే భం చిక….
ఊరువాడ చిందులాడే ఎంచక్కా…

ఒక వేకువ దీపంతో …ఈ లోకం మేలుకొని…
ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని….

ధన ధాన్యం రాసులు పోసి….
ధర్మానికి దోసిళ్ళేసి
గుణ శీలం జనకొలు వైతే
మహదేవుడు మారాజైతే

ముత్యాల పండే లోగిళ్ళలో
వరాలనవ్వుల జల్లంటరో…
చుక్కల్లో వెన్నెల బొమ్మ….
పుట్టింటికి నడిచొస్తుంటే…
పక్కన చిరునవ్వుల వాడే…
శివదేవుడు అనిపిస్తుంటే…

ఆ తాత మనవళ్లాట… ఈ ఊరికిఊయల పాట…
ఆ కుంకుమ రేకుల ముట..మా గడపకి వచ్చిన పూట…
పండగే వచ్చినంత సందడంటరో….
సందెపొద్దు చిందులాడె వేడుకంటరో…
హరి ఓం శాంతి శాంతి
డమరుక నాద విశ్వ శాంతి

అనురాగం పురుడోసుకుని
అనుబంధం ముడులేసుకుని
దేవుడు మనిషై పుడుతుంటే…
నలుగురితో నడిచొస్తుంటే…

బుడి బుడి అడుగుల నాట్యానికీ
ఆ నటరాజే గురుతొచ్చేనట
మనిషిని మహానీయుడు జేసీ….
మమతల గుడి ఒడి జేసుకుని….
కనిపించే తల్లులు వుంటే….
లోకాలను వెలిగిస్తుంటే….

ఆ వెలుతురు కిన్నెరబాట
తాతయ్యకు వన్నెల కోట
ఆ కోటకు రారాజెవరో
ఈ కాలమె చెప్పేనంటా

ఝూం కొకో ఝూం కొకో కోడి పుంజురో….
జాతికోడి కూతలేసే పండగంటరో…
చంకలాడే సంకురాతి రొచ్చెనంటరో….
గొబ్బిళ్లమ్మ పువ్వులెట్టి ముగ్గులంటరో…

ఒక వేకువ దీపంతో …ఈ లోకం మేలుకొని…
ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని….
ముసి ముసి నవ్వుల …. విరిసిన పువ్వుల….
పల్లె ఘల్లుమందీ….
ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి…తలలు వంచుకుంది
హరి ఓం శాంతి శాంతి….
డమరుక నాద విశ్వశాంతి…
హరి ఓం శాంతి శాంతి….
డమరుక నాద విశ్వశాంతి…

భం చిక భం చిక చమ్ చక్క..
చక్కనమ్మ ముగ్గులెట్టె ఎంచక్కా…
పాడిపంట పొంగులాడే భం చిక….
ఊరువాడ చిందులాడే ఎంచక్కా…

_____________________-

Song Credits:

సాంగ్ : ఒక వేకువ (Oka Vekuva)
చిత్రం : పెదబాబు (Pedababu)
నటుడు : జగపతి బాబు (Jagapathi Babu)
సంగీతం: చక్రి (Chakri)
సాహిత్యం : జలధి (Jaaladhi), భాస్కర భట్ల రవి కుమార్ (Bhaskara Bhatla Ravi Kumar)

See Also plz click on this: bhajarangabali-song-lyrics-winner

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.