Home » నీలి నీలకంఠుడా (Neeli Neelakantuda) సాంగ్ లిరిక్స్ | Mangli 

నీలి నీలకంఠుడా (Neeli Neelakantuda) సాంగ్ లిరిక్స్ | Mangli 

by Lakshmi Guradasi
398 views
Neeli Neelakantuda song lyrics Mangli

నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలికంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా

ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ

రారా శివయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా…. అభిషేకాలయ్యా
ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా

నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ

మూడు కన్నులవాడ
మూడు శూలాల వాడ
మూడు లోకాలనేలే సాంబయ్యా
(మూడు కన్నులవాడ
మూడు శూలాల వాడ
మూడు లోకాలనేలే సాంబయ్యా)

మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
మాగోడు తీర్చుతావు మా అయ్యా
(మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
మాగోడు తీర్చుతావు మా అయ్యా)

దోసెడన్ని నీళ్లు చల్లితే
బోలెడంత పొంగుతావు శంకరా
పాలధారాలల్ల పోస్తే
పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా

రుద్రుడా వీర భద్రుడా
కాలుడా భక్త లోలుడా
పంచాక్షరాల స్వామి
పంచామృతాల లోన
పంచదార కలిసినట్టు
పంచవయ్యా నీదు ప్రేమ

నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ

సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
వాయు లింగము నీవు పరమేశా
(సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
వాయు లింగము నీవే పరమేశా)

పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
తేజో లింగము నీవు జగదీశా
(పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
తేజో లింగము నీవే జగదీశా)

ఎండికొండల వాసివే నీకు ఏకాదశ రుద్రమే
నందివాహనం ఎక్కిరా
గమకచమకాలు నీకు ఇష్టమే
దేవుడా ఆది దేవుడా అరుణాకోనే నాధుడా

బిచ్చమెత్తే సామి నీవు
అచ్చమైన మనసుతోటి
స్వచ్చమైన జీవితాన్ని
ఇచ్చిపోవా జంగమయ్య

నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా

ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ

రారా శివయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా…. అభిషేకాలయ్యా
ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా
దండాలయ్యా అభిషేకాలయ్యా

___________________

Song Credits:

సాంగ్ : నీలి నీలకంఠుడా (Neeli Neelakantuda)
సాహిత్యం – కాసర్లశ్యామ్ (Kasarla Shyam)
గాయకుడు – మంగ్లీ (Mangli)
సంగీతం – MadeenSK

See Also plz click on this: endikondaalu-eletoda-song-lyrics
jagamantha-neede-kadara-jangama-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.