Home » నల్లని మేఘం చినుకుగా Nallani Megham Chinukuga Mari Song Lyrics

నల్లని మేఘం చినుకుగా Nallani Megham Chinukuga Mari Song Lyrics

by Lakshmi Guradasi
1K views
Nallani Megham Chinukuga Mari lyrics ayyappa

నల్లని మేఘం చినుకుగా మారి
పంబా నదిలో నీరుగా చేరి
అభిషేకం చేస్తానంది అయ్యప్ప
నీకు అభిషేకం చేస్తానంది అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప

బృందావనమే పువ్వుగా మారి
చల్లని నీ చిరునవ్వు గా మారి
పుష్పాజలి చేస్తానంది అయ్యప్ప
నీకు పుష్పాభిషేకం అంది అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప

నెమలి నీకై కురులేవిప్పి
పంబ సుందరతీరం చేరి
నాట్యాలే చేస్తానంది అయ్యప్ప
నీకై నాట్యాలు చేస్తానంది అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప

మలయమారుతం శబరి కి చేరి
చల్లని నీ గుడి సన్నిధి చేరి
వింజామరమిస్తానంది అయ్యప్ప
నీకు వింజామరమిస్తానంది అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప

వేద మంత్రమే తంత్రిగామారి
విశ్వవిదాత విరంచిగా మారి
పడి పూజలు చేయగ వచ్చారయ్యప్ప
నీ గుడి పూజలు చేయక వచ్చారయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప

See Also plz click on this: satyam-jyothiga-velugunaya-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.