కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య .
నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారమైతే అలవాటు పడ్డ వరుకు దినదిన గండమే అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది. భార్య రత్నాలు.
నువ్వు అలా అంటున్నావు. గాని గంట నుంచి కిలో నలభై కిలో నలభై అంటున్నా కోనేవారి సంఖ్య అంతంతం మాత్రంగానే ఉంది. ఉసూరుమంటూ చెప్పాడు. సూరయ్య
కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను అమ్మిపెడతా ఈ కూరగాయాలు అంటూ భరసా ఇచ్చింది. రత్నాలు
సూరయ్య నిద్రకు ఉపక్రమించారు గంటపోయక లేచి చూశాడు. కూరగాయాన్ని అమ్ముడైపోయాయి. నష్టానికి అమ్మేశావా అనుమానంగా అడిగాడు లేదు. నువ్వు చెప్పే రేటుకే అమ్మను నా తెలివికి పదును బెట్టి పావు కేజి పది పావు కేజీ పది అని అరిచాను. నలభై రూపాయల దగ్గర పది రూపాయలు తక్కువగా అనిపించంతో బరువు విషయం మరిచి కావల్సినవి కొన్నారు. అసలు విషయం చెప్పింది. రత్నాలు.
భార్య తెలివికి మెచ్చుకుని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తు నిశ్చంతంగా ఉన్నాడు. సూరయ్య.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.