ఒక గ్రామంలో ఒక ధనికుండేవాడు అతను పేదలకు ఎలాటి దానధర్మాలు చేసి ఎరగడు పిసిని గొట్టుగా గొప్పఖ్యాతి తెచ్చుకున్నాడు. ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు మీదేవూరు అని ధనికుడు ఆ మనిషికి అడిగాడు. ఈఊరే అన్నాడా మనిషి అసంభవం నేను దానధర్మాలు చెయ్యనని ఊళ్లో అందరికీ తెలుసు అన్నాడు. ధనికుడు ఆ గ్రామంలోనే ఒక చెప్పులు కుట్టేవాడు. ఉండేవాడు ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు మహాదాత కొంతకాలానికి ధనికుడు మరణించాడు. గ్రామస్తులు అతని శవాన్ని దారి పక్కన పాతేశారు. అతని చావుకు ఎవరూ విచారించలేదు. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాళ్లు వస్తున్నారు. కాని అతను నాదగ్గరి ఏముంది ఇవ్వటానికి అనటం మొదలు పెట్టాడు. గ్రామపెద్ద అతన్ని పిలిపించి మహాదాత అనిపించుకున్న వాడివి ఆకస్మాత్తుగా దానధర్మాలు మానేశావుట ఏమిటి కారణం అని అడిగాడు. దానధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ధనికుడే అంతులేనిడచ్చిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తన దన్న సంగతి ఎవరితోనూ చెప్పనని నా చేత ప్రయాణం చేయించుకున్నారు. ఇప్పుడాయన పోయాడు. పెద్దవాణ్ణి నేనేమి ఇచ్చేది. అన్నాడు చెప్పులు కుట్టేవాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.