కృష్ణా వినవా రాధ మదిలో (Krishna Vinava) సాంగ్ లిరిక్స్ | Sneham

by Lakshmi Guradasi

కృష్ణా వినవా రాధ మదిలో ఎంత కలవరమో
కళ్ళల్లో కాంతుల సిరులు
గుండెల్లో నీకై మరులు
కృష్ణా వినవా రాధ మదిలో ఎంత కలవరమో
కళ్ళల్లో కాంతుల సిరులు
గుండెల్లో నీకై మరులు

దోర వెన్నెలలో జారు వేళలో కన్నె రాధ కదిలే
మధుర రాగమొకటాలకించి తన ప్రియుని కొరకు వెతికే
వేణు మాధవుని కానలేని చెలి మనసు మూగబోయే
కన్నె బాధగని కాటుకే కరుగ యమున నల్లనాయే

కడలీలోని కెరటాలే ఎదనుదాటు విరహాలై
ఎంత కలయజూచిననో కానరాడే మాధవుడు
ఆ గగనంలోని చుక్కలు అన్ని కన్నులు కాగా
వెదికెను రాధా కృష్ణా కృష్ణా అనుతూ

విన్నావా చెలి పిలుపు?
కృష్ణా ఇది ఏం వలపు?
కృష్ణా వినవా రాధ మదిలో ఎంత కలవరమో
కళ్ళల్లో కాంతుల సిరులు
గుండెల్లో నీకై మరులు

కృష్ణ మురళీ ధ్వని గాలిలోన విని రాధ పులకరించే
ముగ్ధ మోహనుని మదన సుందరుని తరుణి కాంచనించే
కారు చీకటిలో దీపమల్లే ఘనశ్యాముడెదురుపడడే
అతడే సర్వమను రాధ హృదయమును అసలు తెలుసుకొనడే

పెదవి ఒనికేనేందుకనో
వయసు ఉడికే దేనికనో
కాలమాగెనెందుకనో
అడుగుపడదు దేనికనో
నీ పిల్లన గ్రోవి సవ్వడి వెనక
శిలయై పోదా కన్నె రాధా కృష్ణా రావా రావా

కోరింది నీ రాధ
వెచింది నువ్ లేక
కృష్ణా వినవా రాధ మదిలో ఎంత కలవరమో
కళ్ళల్లో కాంతుల సిరులు
గుండెల్లో నీకై మరులు

ఒళ్ళు జల్లు మన గుండె ఘల్లు అన కన్నె కనులు తెరిచి
కృష్ణుడేడియని కలయజూచినది లేత మనసు పరిచి
దారిచూపు మా కృష్ణ కృష్ణ అని ఎంత వేడుకున్నా
భామబాధగని శ్యామసుందరుడు జాలిచూపడాయే

మనసునంత దోచుకోని
మరువనేల గోపాల
చెలిని గుండెకదుముకుని
సేద తీర్చ రావేలా
ఈ విశ్వమంతా నిండిన ప్రేమ నీవేనంటు నీవేనంటు కృష్ణా రావా రావా

నీకై వెచే రాధా
సర్వం నీవే కాదా

In English Version:

Krishnaa vinavaa Raadha madilo enta kalavaramo
Kallallo kaantula sirulu
Gundello neekai marulu
Krishnaa vinavaa Raadha madilo enta kalavaramo
Kallallo kaantula sirulu
Gundello neekai marulu

Dora vennelalo jaaru velalo kanne Raadha kadhile
Madhura raagamokat aalakichi tana priyuni koraku vethike
Venu Maadhavuni kaanaleni cheli manasu moogaboye
Kanne baadhagani kaatuke karuga Yamuna nallanaye

Kadaliloni kerataale edanudaati virahaalai
Enta kalayajoocinanono kaanaraade Maadhavudu
Aa gaganamloni chukkalu anni kannulu kaaga
Vedhikenu Raadhaa Krishnaa Krishnaa anutu

Vinnaavaa cheli pilupu?
Krishnaa idi em valapu?
Krishnaa vinavaa Raadha madilo enta kalavaramo
Kallallo kaantula sirulu
Gundello neekai marulu

Krishna murali dhvani gaalilona vini Raadha pulakariche
Mugdha mohanuni madana sundaruni taruni kaanchaniche
Kaaru cheekatilo deepamalle ghana shyaamudu edurupadade
Atade sarvamanu Raadha hrudayamunu asalu telusukonade

Pedavi onikenendukano
Vayasu udike denikano
Kaalam aagenendukano
Adugupadadu denikano
Nee pillana grovi savvadi venaka
Silayai poodaa kanne Raadhaa
Krishnaa raavaa raavaa

Korindi nee Raadha
Vechindi nuv leka
Krishnaa vinavaa Raadha madilo enta kalavaramo
Kallallo kaantula sirulu
Gundello neekai marulu

Ollu jallu mana gunde ghallu ana kanne kanulu therichi
Krishnudediyani kalayajoocinadi letha manasu parichi
Daarichoopu maa Krishna Krishna ani enta vedukunnaa
Bhaama baadhagani Shyaamasundarudu jaalichoopa daaye

Manasunanta dochukoni
Maruvanelaa Gopaala
Chelini gundekadumukoni
Seda teercha raavelaa
Ee vishwamantaa nindina prema neevenantu neevenantu
Krishnaa raavaa raavaa

Neekai veche Raadhaa
Sarvam neeve kaadaa

____________________-

Song Credits:

చిత్రం – స్నేహం (Sneham)
పాట – కృష్ణ వినవా (Krishna Vinava)
ఆర్టిస్ట్ – జ్యోతిక (Jyothika), షర్బానీ ముఖర్జీ (Sharbani Mukherjee)
సంగీతం – విద్యాసాగర్ (Vidyasagar)
సాహిత్యం – భువనచంద్ర (Bhuvanachandra)
దర్శకుడు – ప్రియదర్శన్ (Priyadarshan)
గాయని – K. S. చిత్ర (K. S. Chithra), స్వర్ణలత (Swarnalatha)

See Also plz click on this: jaya-janardhana-krishna

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like