సుక్క తీరు సక్కనోడిని
లెక్కలెన్నో యేసుకున్న
సక్కమైనా బంగారమని
ఒక్క తీరే తలచుకున్న
ఎంబాట ఎంబాటె పడుతుంటే
నా మనస్సు వాని మీద పారేసుకున్న
యేలు పట్టుకుని ఏలుకుంటాడని
ముద్దుగా మురిసిపోయిన
ఎంత నచ్చకున్న రోజు రోజు
వాడి చేష్టలతో యష్ట కొచ్చిన…
రాముడు కాదమ్మా వీడు
కొంటె కన్నయ్య గుణములునోడు
సేదురల చిన్నోడు వీడు
పాటించుకోడమ్మా నా గుండె గోడు
రాముడు కాదమ్మా వీడు
కొంటె కన్నయ్య గుణములునోడు
సేదురల చిన్నోడు వీడు
పాటించుకోడమ్మా నా గుండె గోడు
దిగువంగా వాడు ఏమార్చినాడు
మాటలతో నన్ను బాట కలిపిండు
పక్కాగా చూడు బద్మషిగాడు
బహురూపు వేషాల బలే మోసగాడు
వాని ఉద్దెర ముచ్చట్ల నమ్మకనే ఇట్ల
ఇక్కట్ల పాలియైతనో…
వంకర బుద్ధి మారేదెట్లా మునపట్ల
నాతోవ మలుపుకుందుదెట్లనో….
అతడు: మోసాలు ఎరుగని ఎంతకు తరగని
ప్రేమంతా పదిలంగా నీకోసం దాచిన
ఏడేడు జన్మల తోడు నీడ నువ్వే
కావాలంటూ కొట్టి దేవుళ్ళ మొక్కిన…
కన్నయ్య కాదమ్మా నేను
కంటి పాపోలే చూసుకుంటాను
నువ్వు మెచ్చే రామున్ని నేను
సీత కష్టాలు ముడి పెట్ట పోనూ …
ఆమె: పక్కింటి పద్మ ముందింటి మమత
ఇంటియెనకనే వుండే కాప్పోల రజిత
వారసకలుపుని సరసమాడుతుంటే
సైసక్క మనసుల తెగ వనపోత…
ఆ నగరాల పోరడు నికరంగా నన్ను
నిలువున ముంచినాడు…
ఆ సోకులా సురాణి సోపతి అయినాక
శోకాలు పెరిగినయో…
అతడు: గన్నేసి మందిలా ఇన్నేసి నిందలు
యెన్నని మోతునే తగారని రందులు
చెయ్యాలే తప్పులు పడబోకు తిప్పలు
చల్లర్చుకో పిల్ల నికళ్ళ నిప్పులు…
కన్నయ్య కాదమ్మా నేను
కంటి పాపోలే చూసుకుంటాను
సుగుణాల రామున్ని నేను
చచ్చేదాకా నితోడుంటాను…
_______________________________________________
సంగీతం: కళ్యాణ్ కీస్
గాయకులు: వాగ్దేవి, హనుమంత్ యాదవ్
సాహిత్యం: కమల్ ఎస్లావత్
కళాకారులు: రాము రాథోడ్, బ్రమరాంబిక తూటికా
ఇంటిపక్కనే ఉంటది పోరి సాంగ్ లిరిక్స్ – జానపద పాట(folk song)
కోర కోర సూపుల కోమలాంగివే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్(Ramu rathod)
డియా డియా డియారే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్(Ramu Rathod)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.