లాలిపాట తెలియదులే
జోల నేను ఎరగనులే
గోరుముద్ద తినలేదే
నీ గుండెపైన ఆడలేదే
అమ్మ ప్రేమే ఇన్నినాళ్ళు
నోచుకోలేదమ్మా
అమ్మ ఒళ్ళో ఒక్కరోజు
నిదురపోలేదమ్మా
అమ్మ చెయ్యే అందుకోగా
ఆశగా ఉందమ్మా
ఆశలన్నీ తీర్చుకోగా
అకాలౌతోందమ్మా
మళ్ళీ పుట్టానమ్మ
అమ్మా అమ్మా…
అక్షరాలు దిద్దించేసి
అన్ని నేర్పించు
రక్షరేకు కట్టించేసి
నన్ను దీవించు
తప్పు చేస్తే దండించు
నేను గొప్ప చేస్తే గర్వించు
చిన్ననాడు పొందలేని
గారాబాన్ని పంచు
ఎన్నడైనా అందుకోని
ఆనందాన ముంచు
పెద్దవాడిననుకో కాస్త ముద్దు చేసి
మురిపించు
ఎన్నో ఎన్నో కోరికలు ఉన్న
కొన్నే కొన్నే విన్న వించుతున్నా
నన్ను కన్నా తల్లే
గర్భగుడి ముందు ఇలా ఇవాళా
మళ్ళీ పుట్టానమ్మ
అమ్మా అమ్మా…
_________________________________________
పాట: మళ్ళీ పుట్టానమ్మ (Malli puttanamma)
చిత్రం: అహో విక్రమార్క (Aho Vikramaarka)
గాయకుడు: కాల భైరవ (Kaala Bhairava)
స్వరకర్త: అర్కో (Arko)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandrabose)
తారాగణం: దేవ్ (Dev), చిత్ర శుక్లా (Chitra Shukla),
దర్శకుడు: పేట త్రికోటి (Peta Trikoti)
నిర్మాతలు: ఆర్తి దేవిందర్ గిల్ (Aarti Devinder Gill)
మీహిర్ కులకర్ణి (Meehir Kulkarni)
అశ్విని కుమార్ మిశ్రా (Ashwini Kumar Misra)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.