కాటిలో కాలే కట్టెల మేడ Kaatilo Kale Kattela Meda song lyrics

by Lakshmi Guradasi

కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నువ్ ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
నువ్వు ఆడిన ఆటలు.. చెప్పిన మాటలు.. చాలుర ఓ నరుడా..
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా..

ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా..
నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా..
కాలె నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా..
ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా..

ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నువ్ ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తయిరా..
నీ వాళ్లే నిన్ను ఒంటరిగా వదిలేసి పోతరురా..
నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా..
నీ ఇంటె అడవిలో నీకొక రంగుల బంగుల కడతరురా..

ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందర పడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నువ్ ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా..
చిరు నవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేంపోతదిరా..
పగిలే గుండెకు ఎడమచేతితో నిప్పంటిస్తరురా..
స్వర్గం నరకము ఉన్నదొలేదో ఎవరికి తెలియునురా..

ఓ ఓ ఓమనిషి.. మాయా ప్రపంచం ఈ లోకం..
ఓ ఓ ఓమనిషి.. కలల ప్రపంచం ఈ లోకం..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

_________________________

Song Credits:

సాంగ్ : కాటిలో కాలే కట్టెల మేడ (Kaatilo Kale Kattela Meda)
సంగీత దర్శకుడు: యాదా గౌడ్ కోనింటి Yada Goud Koninti
సాహిత్యం & గాయకుడు: బాలు కె అసుర Balu K Asura
ప్రోగ్రామింగ్: రామ్ మోహన్ చారి Ram Mohan Chari

See Also plz click on this: yegiri-padaboke-yemukala-bomma-folk-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like