Home » జగ్గన్న తోట ప్రభల తీర్థం

జగ్గన్న తోట ప్రభల తీర్థం

by Nikitha Kavali
0 comment
66

సంక్రాంతి అంటే మన తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగ లాగా చేస్తారు. ఒక్కో ప్రదేశం లో ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో విభిన్న ఆచారాలతో పండగ వైభవ, సంబరాలను అంబరాన్ని అంటేలా చేస్తాయి. అలాంటి ఒక ప్రాచీనమైన ఆచారమే కోనసీమ ప్రాంతాలలో నిర్వహించే ప్రభల తీర్థం. ఈ ప్రభల తీర్థాన్ని గోదావరి జిల్లాల్లో పాటిస్తారు. కానీ జగ్గన్న తోట లో నిర్వహించే ప్రభల తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందినది. 

మన దేశం లోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది వస్తారు. ఎన్నో శతాబ్దాల నుంచి మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఇంకా ఇలా పాటిస్తున్న గ్రామాలూ మన భారత సంస్కృతిని కాపాడుతున్నాయి అని చెప్పవచ్చు. 

జగ్గన్న తోట ప్రభల తీర్థం చరిత్ర:

అమలాపురానికి దగ్గర్లోని ముసలపల్లి ఇరుసమండ గ్రామాల మధ్య ఉన్న ఏడు ఎకరాల కొబ్బరి తోటను జగ్గన్న తోట గా పిలుస్తారు. కథనాల ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దం లో ఏకాదశ రుద్రులు లోకకల్యాణం కోసం సంక్రాంతి పండుగ రోజుల్లో చివరి పండగ అయినా కనుమ పండగ నాడు ఈ జగ్గన్న తోట లో సమావేశమయ్యి లోక పరిస్థుతుల గురించి చర్చించే వారు అని చెబుతున్నాయి.

ఇలా సమావేసమవ్వడానికి మోసలపల్లి గ్రామ దేవుడు అయినా భోగేశ్వర స్వామి మిగిలిన వారికి ఆహ్వానం పంపితే అందరూ సమావేశమయ్యేవారు అని నమ్ముతారు. ఇక అప్పటి నుంచి ఈ జగ్గన్న తోట లో ప్రభల తీర్థం నిర్వహిస్తున్నారు అని ఆ స్థల చారిత్రక కథనం చెబుతుంది.

ఈ ప్రబలాలను ఎలా చేస్తారు:

ఈ ప్రభలలను వెదురు బొంగులు, తాటి దూలాలు, టేకు చెక్కలుతో తయారు చేస్తారు. ఇంకా వరి కంకులు, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. పదకొండు గ్రామాల నుంచి వచ్చే ప్రబలాలను ఈ జగ్గన్న తోటకు తీసుకువస్తారు. ఆయా 11 గ్రామాల నుండి తీసుకోవచ్చే ఈ ప్రభలలను రహదారుల వెంట కాకుండా, పోలాలు, కాలవ గట్లను, దాటుతూ భుజాల మీద మోసుకుంటూ జగ్గన్న తోటకు తీసుకువస్తారు. 

జగ్గన్న తోటకు చేరే ప్రభలలు:

ఒక్కో గ్రామం నుంచి ఒక్క దేవుడిని ప్రభలంగా తయారు చేసి జగ్గన్న తోటకు తీసుకువస్తారు. ఆయా గ్రామ ప్రబలాల వివరాలు కింద ఉన్నాయి.

గ్రామం దేవుడు 
గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి 
గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి 
వ్యాగ్రేశ్వరం వ్యాగ్రేశ్వర స్వామి 
ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి 
వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి 
పెదపూడి మేనకేశ్వర స్వామి 
ముక్కామల రాఘవేశ్వర స్వామి 
మోసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి 
నేదునూరు చిన్నమల్లేశ్వర స్వామి 
పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామి 
పుల్లేటికుర్రు అభినవ వ్యాగ్రేశ్వర స్వామి 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version