ఇప్పటి కాలం అమ్మాయిలకు ఏడు వారాల నగలు అంటే పెద్దగా తెలియకపోవచ్చు గాని, ఒక్కప్పటి స్త్రీల దగ్గర ఈ ఏడు వారల నగలు కచ్చితంగా ఉండేవి. ఈ ఏడు వారల నగలను వారం లో ఒక్కో రోజు ఒక్కో రకమైన రాళ్ళని కలిగి ఉండే నగలను ధరించేవారు.
మన ఆచారం లో భాగంగా ఈ ఏడు వారల నగలను ఆ రోజు అధిపతి అయినా గ్రహానికి అనుగునంగా ఆ రాయిని కలిగి ఉన్న నగలను ధరిస్తారు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఈ ఏడు వారల నగలు లేవు అసలు ఆ మాట కూడా ఎవరి నోట వినపడడం తక్కువయింది.
ఏడు వారల నగలలో ఏ ఏ రోజు ఏ నగలను ధరిస్తారో తెలుసుకుందాం రండి.
ప్రతి రోజు ఆ అనుకూల గ్రహాల అనుగ్రహం వారికి ఎప్పుడు ఉండాలి అని, అంత మంచే జరగాలి అని మన భారతీయ స్త్రీలు ఏడువారాల నగలను ధరించేవారు. ఏ ఏ వారం ఏ నగలను ధరించాలో కింద వివరించి ఉంది.
రోజు | నగ |
ఆదివారం | కెంపులు |
సోమవారం | ముత్యాలు |
మంగళవారం | పగడాలు |
బుధవారం | మరకత పచ్చ |
గురువారం | కనకపుష్యరాగం |
శుక్రవారం | వజ్రాలు |
శనివారం | నీలం రంగు మణి |
ఆదివారం
ఆదివారం రోజు సూర్య భగవానుడి అనుగ్రహం కోసం కెంపులను పొదిగి ఉన్న నగలను ధరిస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం వలన వాళ్ళు వాళ్ళ జీవితం లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు.
సోమవారం:
సోమవారానికి చంద్రుడు అధిపతి కనుక చంద్రుడికి ఇష్టమైన ముత్యాల హారాలు, గాజులను ధరిస్తారు. చంద్రుడి అనుగ్రహం వలన మానసిక ఆందోళనలకు దూరంగా ఉంటారు. జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
మంగళవారం:
మంగళవారం నాడు కుజుడి అనుగ్రహం కోసం పగడాలను ధరిస్తారు . కుజుడి అనుగ్రహం ఉన్నవాళ్ళకి త్వరగా పెళ్లి జరుగుతుంది అని, కుజ దోషం ఉన్న పోతుంది నమ్ముతారు.
బుధవారం:
బుధవారం నాడు బుధుడికి ఇష్టమైన మరకతమని(అంటే ఆకు పచ్చ రంగు రాయి) ధరిస్తారు. బుధవారానికి బుధుడు అధిపతి కనుక బుధుడి అనుగ్రహం తో వాళ్ళ వృత్తి జీవితం లో విజయాలు సాధించాలి అని పచ్చ రాయి హారాలు , నగలను ధరిస్తారు.
గురువారం:
గురువారం గురుడికి ఇష్టమైన కనకపుష్యరాగం(అంటే బంగారు రంగులో ఉండే రాయి) ధరిస్తారు. గురువారానికి బృహస్పతి అధిపతి అన్ని గ్రహాలకు గురువుగా భావిస్తారు. బృహస్పతి అనుగ్రహం ఉంటె విద్యార్థులు విద్యలో మంచి గా రాణిస్తారు , అన్ని విజయాలు చేరుతాయి. జీవితం చాల ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.
శుక్రవారం:
శుక్రవారానికి శుక్రుడు అధిపతి, కనుక శుక్రుడికి ఇష్టమైన వజ్రాలను ధరిస్తారు. శుక్రవారం రోజు వజ్ర ఆభరణాలు ధరిస్తే వారికీ జీవితంలో ఎల్లప్పుడూ దనం చేకూరుతూ, అష్టఐశ్వర్యాలతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అని భావిస్తారు.
శనివారం:
శనివారానికి అధిపతి శనీశ్వరుడు, ఈరోజు శని దేవుడికి ఇష్టమైన నీలం రంగు మణులను ధరిస్తారు. ఆలా ధరించడం వలన వారికి ఉన్న మృత్యు దోషాలు, అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి కొంచెం నిర్మలమైన జీవితం గడుపుతారు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.