మన హిందూ సంప్రదాయాలలో దేవుడికి అభిషేకం చేయడం అనేది చాల పవిత్రమైన ఆచారంగా మనం భావిస్తాం. దేవుడికి అభిషేకం చేస్తే మనకి అంత మంచి జరుగుతుంది అని గట్టిగా నమ్ముతాము. కానీ కొంతమంది ఇలా అభిషేకం చేయడం వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమి ఉండదు అని పైగా ఆలా చేయడం ఆహారాన్ని వృధా చేసినట్టు అవుతుంది అని అంటారు. కానీ అభిషేకం చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.
మన పూర్వికులు దేవుడిని విగ్రహారాధన చేయడం ప్రారంభించాక కొన్ని సంవత్సరాల తర్వాత వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా ఆ విగ్రహ రాళ్ళల్లో పగుళ్లు రావడం మొదలయ్యాయి. అలా పూజిస్తున్న విగ్రహాలకు పగుళ్లు రావడం వల్ల భక్తులలో ఒక రకమైన భయం, బాధ ఏర్పడ్డాయి.
ఇక అప్పుడు మన మునులు, ఋషులు ఇలా జరగడాన్ని ఆపడానికి పాలు, చక్కర, తేనె, పెరుగు పదార్థాలను వాడి అభిషేకం చేసే వారు. ఇలా చేయడం వాళ్ళ విగ్రహలలో పగుళ్లు రాకుండా దృడంగా ఉండేవి. అసలు ఋషులు ఈ పదార్థాలని ఎందుకు వాడారు అంటే ఈ పదార్థాలు అన్నిటిలో కొవ్వు ఎక్కువగా ఉండేవి. వీటిల్లో ఉన్న కొవ్వు పదార్ధం విగ్రహం లోని ఆటమ్స్ విడిపోకుండా గట్టిగ ఉండేలా తోడ్పడ్డాయి.
దాంతో విగ్రహం ఎన్ని వేల సంవత్సరాలు అయినా దృడంగా ఉండేవి. ఇదంతా తెలుసుకున్నాక మన ఋషులను మించిన సైంటిస్ట్ లు ఈ భూమి మీద ఎక్కడ లేరు అనిపించింది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.