Home » ఐస్‌లాండ్ గురించి మనకు తెలియని చాల విషయాలు…

ఐస్‌లాండ్ గురించి మనకు తెలియని చాల విషయాలు…

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! ఈ మద్యకాలంలో ఎక్కువగా వింటున్న దేశం పేరు ఐస్‌లాండ్, ఈ దేశం గురించి మనకు తెలియని చాల విషయాలు దాగి ఉన్నాయి. ద్వీప దేశం అయిన ఈ ఐస్‌లాండ్ గురించి చాల మందికి చాల విషయాల గురించి తెలియదు. ఇప్పడు ఈ ఆర్టికల్ లో అవేంటో మనం వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో మే 15 నుండి జులై 15 పగటి సమయం ఎక్కువ ఉంటుంది. ఇది దాదాపు రాత్రి లేనంతగా ఉంటుంది. ఈ టైం లోనే ఈ దేశానికీ టూరిస్ట్ లు ఎక్కువగా వస్తుంటారు.

ఈ దేశాన్ని అధికారికంగా ది రిపబ్లిక్ అఫ్ ఐస్‌లాండ్ అని పిలుస్తారు, దీని రాజధాని రేక్‌జావిక్(Reykjavik). ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం, అంటే ఈ దేశానికీ అన్నివైపుల సముద్రం(నీరు) ఉంటుంది. ఈ దేశంయొక్క కరెన్సీ నీ ఐస్‌లాండిక్ క్రోనా అని పిలుస్తారు. ఈ ఐస్‌లాండిక్ క్రోనా విలువ మన భారత దేశపు రూపాయితో పోల్చి చూస్తే ఒక ఐస్‌లాండిక్ క్రోనా విలువ మన రూపాయి లోని 62 పైసలతో సమానంగా ఉంటుంది. ఈ దేశం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ చాల చల్లగా ఉంటుంది.

information of iceland contry

ఈ దేశంలోని ప్రజలు జానపద కథలలోని కొన్ని ఫిక్షనల్ కెరెక్టర్స్ ని ఎక్కువగా నమ్ముతారు, వీటిని ఆల్బ్స్ అంటారు. ఈ ఆల్బ్స్ అనేవి జానపద కథలలో వచ్చే కొన్ని జీవుల సమూహం. ఈ ఆల్బ్స్ ఎన్నో సంవత్సరాలకు పూర్వం నుండి ఇప్పటికీ ఇవి ఈ దేశంలో జీవిస్తున్నాయని, ఇవి కొండలు, గుహలలో ఉంటాయని ఈ దేశస్థుల నమ్మకం. ఈ దేశంలో ఏవైనా రోడ్లు వేయాల్సి వచ్చినప్పుడు పర్వతాలు అడ్డుగా ఉంటే ఆ పర్వతాలలో ఆల్బ్స్ జీవిస్తుంటారని వాటిని కూల్చకుండా రోడ్లను దారి మళ్లించి మరీ పక్కకు వేస్తారు. ఈ ఆల్బ్స్ ను బేస్ చేసుకొని చాల హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి.

information of iceland contry

ఇక ఆహారం విషయానికొస్తే ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ దేశం చుట్టూ కూడా సముద్రం ఉండడంతో ఇక్కడ చేపల వేట ఎక్కవగా జరుగుతుంది. దీంతో ఇక్కడి ప్రజల ఆహారంలో చేపల వాడకం ఎక్కవగా ఉంటుంది. దీంతో పాటు పాడి పరిశ్రమ నుంచి తయారు చేసిన పెరుగులాంటి పదార్థం అయిన కైర్ అనే దాని ఎక్కువగా తింటుంటారు. ఇంకా మేక మాంసాన్ని గ్రిల్ పై కాల్చి తయారు చేసే స్మోకెడ్ లాంప్ అనే మాంసాన్ని కూడా ఎక్కువగా తింటుంటారు. ఈ దేశంలో షార్క్ చేపల మాంసాన్ని కూడా చాల ఇష్టంగా తింటుంటారు. దీంతో పాటు ఎండబెట్టిన చేపలను బట్టర్ తో కలిపి తింటుంటారు

information of iceland contry

ఈ దేశంలో పఫిన్స్ అని పిలవబడే ప్రత్యేకశైలి కలిగిన బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చూడడానికి బాతులా ఇంకా అలాగే పక్షిలాగా కూడా కనిపిస్తాయి. ఇది ఈ దేశంలో సముద్రాలలో వుంటూ చేపలను వేటాడి తింటూ ఉంటాయి. అయితే ఈ పక్షులను స్థానికంగా ఉండేవారు ఎక్కువగా వేటాడి తింటుంటారు. ఇక్కడి ప్రజలు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ ల కంటే కూడా డిన్నర్ కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వీరు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కి ఫ్రూట్స్, కాఫీ వంటి లైట్ ఫుడ్ తీసుకోని, డిన్నర్ ని మాత్రం ఫ్యామిలీతో కలిసి నాన్వెజ్ తో ఎక్కువగా తింటారు. ఇక్కడి ఉండే ప్రజలు కూల్ క్లైమేట్ తట్టుకోవడానికి కాఫీని ఎక్కువగా తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ విషయానికొస్తే కోకోకోలాని ఎక్కువగా వాడుతుంటారు.

information of iceland contry

సాధారణంగా తిమింగలం, షార్క్ వంటి వాటి మాంసాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ దేశంలో మాత్రం వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా తిమింగలం మాంసాన్ని మంచి రుచికరంగా వండి వడ్డిస్తుంటారు.

ఈ దేశానికీ వచ్చే టూరిస్టులు ఎక్కువగా స్నో బోర్డింగ్, రాక్ క్లైమింగ్, ఐస్ క్లైమింగ్ వంటివి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఈ దేశం యొక్క నేచర్ చాల అందంగా ఉంటుంది. ఇంకా హైకింగ్, ఫిషింగ్, సైక్లింగ్ వంటివి కూడా టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు.

information of iceland contry

ఈ దేశంలోని ప్రజల ప్రదాన వాహనం కార్, ఇక్కడి ప్రజలలో ప్రతి ఇద్దరికీ ఒక కార్ ఉంటుంది. ఇక్కడి ప్రజలు గ్లిమా అనే ఒక సాంప్రదాయక ఆటను ఆడుతారు. ఇది చూడడానికి ఒక ముష్టి యుద్ధం లాగ ఉంటుంది. ఇంకా కుస్తీ, ఫుడ్ బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్ వంటికి కూడా ఎక్కువగా ఆడుతుంటారు. ఈ దేశం యొక్క జాతీయక్రీడ హ్యాండ్ బాల్. ప్రపంచంలో ఉండే హ్యాండ్ బాల్ టీమ్స్ లో టాప్ 12 లో ఈ దేశం యొక్క టీం కూడా ఉంది.

information of iceland contry

ఈ దేశానికీ తూర్పు వైపు ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది. ఇంకా ఫామ్ ల్యాండ్స్, హార్బర్స్, తూర్పు ప్రాంతం వైపు ఉంటాయి. అలాగే ఫిషింగ్ విలేజెస్ కూడా తూర్పు ప్రాంత వైపు ఎక్కువగా ఉండడం వలన వీటిని ఫిషింగ్ ల్యాండ్స్ అనికూడా అంటారు. ఇక్కడ ఉండే మచ్యకారులు చేపలు ఎక్కవగా పట్టడం వలన వీటిని ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.

ఇక యూరప్ లోనే అదిపెద్ద జలపాతమైన డెట్టిఫాస్ జలపాతం కూడా ఈ దేశంలో కలదు, ఇది ఈ దేశానికీ సౌత్ కోస్ట్ లో ఉంటుంది. ఈ సౌత్ కోస్ట్ తీర ప్రాంతం చాల అందంగా ఉంటుంది, ఈ దేశానికీ వచ్చే టూరిస్టులు ఎక్కువగా సౌత్ కోస్ట్ లో విహరిస్తుంటారు. ఈ దేశంలోని మొత్తం భూభాగంలోని 30 శాతం భూభాగం అగ్నిపర్వత శిలాజంతో కప్పబడి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువగా ఉంటాయి.

ఎంతో పేమస్ అయిన బ్లూ లగున్స్ కూడా ఈ దేశంలో కనిపిస్తాయి. యూరప్ లో ఉండే ఐస్ గ్లేసియర్స్ లో అతిపెద్ద గ్లేసియర్ అయిన వట్ను జోకుల్ గ్లేసియర్ ఈ దేశంలోనే ఉంది.

information of iceland contry

ఈదేశంలోని ప్రజలు ఎక్కువగా బుక్స్ చదవడానికి అంటే నవలలు, కథలు చదవడానికి మరియు రాయడానికి ఇష్టపడుతుంటారు. ఇంకా ఈదేశంలో రైటర్స్ కూడా చాల ఎక్కువమంది ఉంటారు. ప్రతిఇంట్లో ఒక రచయిత బుక్స్ కానీ కథలు గాని రాస్తూ పబ్లిష్ చేస్తుంటారు.

ఇక ఆర్మీ విషయానికొస్తే ఈదేశానికి స్టాండర్డ్ గా ఉండే ఆర్మీ అంటూ ఏమి లేదు. ఇక్కడ ఉండే పోలీసులు కూడా గన్స్ క్యారీ చేయరు. ఇక్కడ కోస్టగార్డ్స్ మాత్రం ఎయిర్ డిఫెన్సె ని మెయింటైన్ చేస్తుంటారు. ఈదేశంలోని ప్రజలు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. యూరప్ లో ఉండే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ దేశంలో చాల ఎక్కువగా చూస్తారు. సగటున ప్రతి మనిషి ఒక రోజుకు 5 సినిమాలు చేస్తాడని ఒక అంచనా.

ఇక్కడ ఐస్లాండిక్ అనే భాషను మాట్లాడుతారు, ఇక్కడ ఉన్న మొత్తం జనాభాలో 86 శాతం ఐస్లాండిక్ దేశస్థులు ఉంటారు. మిగతా పోలిష్, లిథువేనియన్ వంటి దేశస్థులు ఉంటారు. ఇక్కడ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమేంట్ కింద నడుస్తుంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 39,817 చ.మీ. ఇక్కడ నివసించే జనాభా కేవలం 350000 మంది.

ఈ దేశంలో జనాభా ఎక్కువగా ఆగ్నేయ ప్రాంతంలోనే సగం జనాభాకు పైనే నివసిస్తుంటారు. ఈ దేశం వాతావరణం ఎంత చల్లగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫుటనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే పేలుతున్న అగ్నిపర్వతాలలో 3వంతు అగ్నిపర్వతాలు ఈ దేశంలో ఉన్నాయని అంచనా. ఇక్కడ భూమిలోపల ఎక్కువ వేడి ద్వారా విద్యుత్ తయారు చేస్తారు. ఇంకా ఇక్కడ జలవిద్యుత్ కూడా తాయారు చేసుకుని వాడుతుంటారు. ఈ దేశం ఆర్కిటిక్ కి దగ్గరగా ఉండడం వలన ఒక వైపు చల్లగా, మరోవైపు గల్ఫ్ జలప్రవాహాలు ఉండడం వల్ల కొంచెం వెచ్చగా ఉంటూ చాల అందంగా ఉంటుంది.

about of iceland contry

ఈ దేశం యొక్క ప్రధాన ఆదాయం ఒకప్పుడు చేపలు పట్టడం మీద ఆధారపడి ఉండేది, కానీ ప్రస్తుతం పారిశ్రామిక దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఈ దేశంలో నదులు చాల ఎక్కువగా ఉంటాయి, దీనికారణంగా జల విద్యుత్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల చాల తక్కువధరలో వీరికి విద్యుత్ లభిస్తుంది.

20వ శతాబ్దం వరకు ఐరోపాలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉండేది, ఆతరువాత కాలంలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది. గత శతాబ్దకాలంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా పెరిగింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment