Home » 9 భాషల్లో Google Gemini యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది

9 భాషల్లో Google Gemini యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది

by Shalini D
0 comment

ఇండియాలో గూగుల్ జెమిని యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన జెనరేటివ్ AI చాట్‌బాట్ జెమిని మొబైల్ యాప్‌ను ఇంగ్లీష్ తో పాటు తొమ్మిది భారతీయ భాషలలో ప్రారంభించింది. “గూగుల్ అత్యంత సామర్థ్యమున్న AI మోడళ్లకు వినియోగదారులకు యాక్సెస్‌ను అందించే జెమినీ యాప్, జెమినీ అడ్వాన్స్‌డ్ రెండూ ఇప్పుడు తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది వ్యక్తులు తమ ప్రాధాన్య భాషలో సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో, పనులను పూర్తి చేయడంలో సహాయపడతాయి” అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. గూగుల్ తొమ్మిది స్థానిక భాషలను కూడా జెమిని అడ్వాన్స్‌డ్‌లో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా Google జెమిని అడ్వాన్స్‌డ్‌లో కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో కొత్త డేటా విశ్లేషణ సామర్థ్యాలు, ఫైల్ అప్‌లోడ్‌లు, ఆంగ్లంలో గూగుల్ సందేశాలలో జెమినితో చాట్ చేసే సామర్థ్యం ఉన్నాయి.

Google Gemini App

భారత్‌తో పాటు టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో కూడా జెమినీ యాప్‌ను విడుదల చేశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో లాంచ్‌ను ప్రకటించారు. “యాప్ మీకు అవసరమైన సహాయం పొందడానికి టైప్ చేయడానికి, మాట్లాడడానికి లేదా చిత్రాన్ని జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫ్లాట్ టైర్‌ని ఎలా మార్చాలో సూచనల కోసం దాని చిత్రాన్ని తీయండి లేదా ఖచ్చితమైన కృతజ్ఞతా పత్రాన్ని వ్రాయడంలో సహాయం పొందండి” అని పేర్కొన్నారు.

తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్‌ సేవలందిస్తుందని గూగుల్‌ పేర్కొంది. అంటే మీకు నచ్చిన భాషలో జెమినీని వాడొచ్చు. వాయిస్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించొచ్చి ఏదైనా సెర్చ్ చేయవచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టెక్నాలజీను సందర్శించండి.

You may also like

Leave a Comment