Home » దారంతా మా పులవనమే రాధమ్మ సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk song)

దారంతా మా పులవనమే రాధమ్మ సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk song)

by Lakshmi Guradasi
7K views
Darantha ma pulavaname Radhamma folk song lyrics

అతడు : దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ని మేలు జన్మలో మరువను రాధమ్మ

ఆమె: వద్దు వద్దు నాకు కుదరాదు కిట్టయ్యా
మలెప్పుడైనా వస్తాలే కిట్టయ్యా
మా వాళ్ళు చూస్తే తీరతారు కిట్టయ్యా
మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా

అతడు: ఆహా
ముద్ద బంతి పూలు తెంపిస్తా రాధమ్మ
ముద్దుగా ని జడలో పెట్టుకో రాధమ్మ
ఆమె: చెప్తుంటావ్ ఎందుకురా నా చిన్ని కిట్టయ్యా
ఇంత మొండికేస్తావ్ దేనికిరా కిట్టయ్యా

అతడు: ఆ సన్నజాజి పూలు తెంపిస్తా రాధమ్మ
ని అందానికి సరిపోయేలా రాధమ్మ

దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ని మేలు జన్మలో మరువను రాధమ్మ

మబ్బులన్నీ కమ్ముకొచ్చే రాధమ్మ
ముంచు కోస్తున్నది వాన రాధమ్మ
వానలో తడిసి ముద్దయిదమే రాధమ్మ
నా తోడు నువ్వుండు పోవే రాధమ్మ

ఆమె: తడిసి ముద్దయిన పర్వాలే కిట్టయ్యా
మా ఇంట్లో ఎవ్వరు చూస్తారు కిట్టయ్యా
నా మీద ని ప్రేమ తెలుసులే కిట్టయ్యా
మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా

అతడు: ఆహా
ముద్ద మందారాలు తెంపిస్తా రాధమ్మ
ని ముద్ద మొవ్వుకి కనుక చాలమ్మ
ఆమె: పులదేముంది నా చిన్ని కిట్టయ్యా
మర్నాడు వచైనా తెంపుకుంటా

అతడు: ఆహా
తెప్ప కలువపూలు తెంపిస్తా రాధమ్మ
ని మంచి మానసల్లే ఉంటది రాధమ్మ

దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ని మేలు జన్మలో మరువను రాధమ్మ

భాషలన్నీ వేరైనా రాధమ్మ
దాని భావము ఒక్కటే రాధమ్మ
నువ్వు నేను వేరు కాదే రాధమ్మ
నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ

ఆమె: దారులన్నీ వేరైనా కిట్టయ్యా
చేరే గమ్యము ఒకటే కిట్టయ్యా
నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా
ని చెంతనే ఉండి పోతా కిట్టయ్యా

అతడు: ఆహా
నింగిలో చుక్కోలే పడినా ఈ తారకు
తామర పూవులు తెంపిస్తా రాధమ్మ
ఆమె: ని కళ్ళలో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా
ఇప్పుడే నితో నే వెళ్తుంటే కిట్టయ్యా

అతడు: మన పెళ్ళికి మనమే దండాలు అల్లేసి
మన బంధాన్నీ నిలుపుకుందామె రాధమ్మ

దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ని మేలు జన్మలో మరువను రాధమ్మ

___________________________________________________________

లిరిక్స్ : అస్ చౌహన్
సింగెర్స్ : బొడ్డు దిలీప్ – శ్రీనిధి
మ్యూజిక్ : వెంకట్ అజ్మీర
క్యాస్ట్ : అనిల్ జీల – సహస్ర

ఏమే పిల్ల అంటంటే పార్ట్ 2 సాంగ్ లిరిక్స్ – (folk song)

 Agamma Agaradhe Radhamma folk song | ఆగమ్మ ఆగరాదే రాధమ్మ సాంగ్ లిరిక్స్

కన్నయ్య కదమ్మా నేను సాంగ్ లిరిక్స్ – రాము రాథోడ్(Ramu Rathod)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.