Home » జపాన్‌లో నీటి అడుగున రహస్యమైన “పిరమిడ్ నగరం” (Yonaguni Monument)

జపాన్‌లో నీటి అడుగున రహస్యమైన “పిరమిడ్ నగరం” (Yonaguni Monument)

by Lakshmi Guradasi
0 comment

“యోనాగుని స్మారక చిహ్నం” దీనిని ఐలాండ్ సబ్‌మెరైన్ టోపోగ్రఫీ అని కూడా పిలుస్తారు. ఇది జపాన్ లో యోనాగుని ద్వీపం కింద తైవాన్ కు 100 కిలో మీటర్ల దురం లో 85 అడుగుల నీటి అడుగున ఉన్న నగరం. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం మానవ నిర్మితమని నమ్ముతారు, మరికొందరు ఇది సహజ నిర్మాణం అని నమ్ముతారు.

ఈ స్మారక చిహ్నాన్ని మొదటిసారిగా 1986లో డైవర్లు హామర్‌హెడ్ షార్క్‌లను గమనించడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతున్నపుడు. అందులో కిహచిరో అరటకే అనే డైవర్ ఈ ప్రదేశాన్ని కనుగొన్నాడు. అక్కడ వాళ్ళు పిరమిడ్ లాంటి ఆకారం చూశారు. ఈ విషయం మసాకి కిమురా అనే శాస్త్రవేత్త తో పంచుకున్నారు.

ప్రొఫెసర్ కిముర అతని మనుషులు తో కలిసి ఆ నగరం పరిశోధించడానికి వెళ్ళారు. అక్కడ కైదా లిపిని పోలిన చెక్కడాలు స్మారక కట్టడాలపై ఉన్నాయని కూడా అతను చెప్పాడు. పిరమిడ్ ను పోలివుండే అతి పెద్ద నిర్మాణం 5 దేవాలయాలు మరియు గొప్ప ప్రవేశ ద్వారం తో ఉన్న కోట గా గుర్తించాడు. అక్కడ దొరికిన కుండలు, రాతి పనిముట్లు మరియు నిప్పు గూళ్లు, బహుశా 2500 BCE నాటివి. పిరమిడ్ ఆకారంలో గుడి, రోడ్డు లు, భవనాలు,స్టేడియం లు వున్నాయంట. యోనాగుని రాతి నిర్మాణం ఇసుక రాయి మరియు పాల రాతి నిర్మాణం తో కూడి ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇన్ని ఉన్న ఇది ప్రకృతి సిద్ధమైనదాని అంటున్నారు. 

డైవర్ లు మొత్తం ప్రదేశాన్ని మ్యాప్ చేసారు అది మొతం 45000 చదారపు మీటర్లు ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం 10,000 సంవత్సరాల కంటే పాతది అని అంటున్నారు. యోనాగుని స్మారక చిహ్నం కోల్పోయిన ఖండం యొక్క అవశేషమని కొందరు నమ్ముతున్నారు, మరికొందరు పసిఫిక్ మహాసముద్రంలో ఉందని నమ్ముతున్నారు. 

యోనాగుని స్మారక చిహ్నం( Yonaguni monument exact location)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీ ను చుడండి.

You may also like

Leave a Comment