93

ప్రస్తుత కాలం లో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణ మరియు అతిపెద్ద సమస్య. ఈ జుట్టు రాలడానికి అనేక కారణాలు వున్నాయి. జుట్టు రాలడం అనేది పెద్ద వయసు వారికే కాక, చిన్న వయసు వారిని కూడా ఎక్కువగా వేధిస్తూ వస్తుంది. అయితే మనం కొన్ని రకాల విధానాలు పాటించడం ద్వారా ఈ జుట్టు రాలె సమస్య నుండి బయట పడవచ్చు.

  • ఐరన్, జింక్, విటమిన్లు లో A, D  వంటివి మనం తీసుకునే ఆహార పదార్థాలలో లేకపోవడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తృణ ధాన్యాలు, గుడ్లు, గింజలు, చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. 
  • కొబ్బరి, బాదం, లేదా ఆలివ్ నూనెలను జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించాలి. నూనెను కొద్దిగా వేడి చేసి తలకు సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి.
  • రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, కండిషనర్లు, స్టయిలింగ్ ఉత్పత్తుల వినియోగంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.
  •  స్ట్రయిట్నెర్లు, కర్లింగ్ ఐరన్ లు  వంటి హీట్  స్టైలిష్ సాధనాల వినియోగం తగ్గించడం మంచిది. ఈ పరికరాల నుంచి వచ్చే అధిక వేడి జుట్టును బలహీన పరుస్తుంది.
  • కలబంద జెల్ ను  నేరుగా తలపై అప్లై చేసి 45 నిమిషాలు ఉంచుకుని తేలికపాటి షాంపూ తో కడిగేయండి. కలబంద ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version