Home » ఇంట్లోనే ఫేషియల్ ఇలా చేస్తే ముఖం మెరవడం పక్కా..

ఇంట్లోనే ఫేషియల్ ఇలా చేస్తే ముఖం మెరవడం పక్కా..

by Shalini D
0 comment
90

అందంగా కనిపించాలని చాలా మంది ఫేషియల్ చేయించుకుంటుంటారు. అయితే అందరికీ పార్లర్ కి వెళ్లే సమయం లేకపోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఫేషియల్  చేసుకోవచ్చు… అదిలాగో ఇప్పుడు చూద్దాం.

క్లెన్సింగ్: 

ఫేషియల్లో మొదటి స్టెప్ క్లెన్సింగ్, ముందుగా కొబ్బరినూనె రాసుకొని. అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. ఆ తరువాత వేడినీళ్లలో మంచిన క్లాత్ ముఖంపై పెట్టుకొని, రెండు నివిషాల పాటు ఉండాలి. రెండు నివిషాల ఉన్నా తరువాత పొడి క్లాత్ తో ముఖాన్ని తుడుచుకోవాలి.

స్టీమింగ్: 

ముందుగా ఒక గిన్నెలో కొన్నినీళ్లు పోసి వేడి చేయాలి. ఆ  తర్వాత వేడినీళ్లలో లావెండర్ ఆయిల్ వేయాలి ఆ నీటి ఆవిరి  తగిలేలా ముఖాన్ని గిన్నెకు కాస్త దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా తల మీద ఏదైన టవల్ కప్పుకోవలి. అలా 5 నిమిషాలు పాటు ఉండాలి. ఆ తరువాత ముఖాన్ని మెత్తటి క్లాత్ తో సున్నితంగా తుడుచుకోవాలి.

ఎక్స్‌పోలియేషన్: 

దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, ఒక టేబుల్ రోజ్ వాటర్ వేసి కలపాలి. ಆ మిస్రమణి ఫేస్ కి అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తరువాత పొడి క్లాత్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇప్పుడు మీ పేస్ చాల కాంతివంతంగా కనిపిస్తుంది. 

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version