Home » గుమ్మడి గుమ్మాడి (Gummadi Gummadi) సాంగ్ లిరిక్స్ – డాడీ (Daddy)

గుమ్మడి గుమ్మాడి (Gummadi Gummadi) సాంగ్ లిరిక్స్ – డాడీ (Daddy)

by Vinod G
965 views
gummadi gummadi song lyrics daddy

గుమ్మాడి గుమ్మాడి
ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో
మురిసే కూచిపూడి

చిందాడి చిందాడి
తుల్లిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో
చూడు ఎంత వేడి

వద్దంటే వినదే
పగలంతా ఆడిపాడి
ముద్దయిన తినదే
పరిగెత్తే పైడి లేడి

చిలకల్లే చెవిలో
ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైన
ఏం చేయాలి

గుమ్మాడి గుమ్మాడి
ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో
మురిసే కూచిపూడి

యెన్నెన్నో ఆశలతో
పెంచానమ్మ గుండెల్లో

యెన్నెన్నో ఆశలతో
పెంచానమ్మ గుండెల్లో
నువ్వే నా కలలన్నీ
పెంచాలే నీ కన్నుల్లో

నా తల్లివి నువ్వో
నీ తండ్రిని నేనో
ఎవరినెవరు
లాలిస్తున్నారో

చిత్రంగా చూస్తుందే
నీ కన్నతల్లి
పొంగిందే ఆ చూపుల్లో
పాలవెల్లి

గుమ్మాడి గుమ్మాడి
ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో
మురిసే కూచిపూడి

వర్షంలో తడిసొచ్చి
హై రే హై అనుకుందామా

వర్షంలో తడిసొచ్చి
హై రే హై అనుకుందామా
రేపుదయం జలుబొచ్చి
హాచి హాచి అందామా

ఓ వంక నీకు
ఓ వంక నాకు
అవిరి పడుతూనే
మీ మమ్మీ

హై పిచ్లో మ్యూజిక్ అల్లే
తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయెటల్లే
వినబడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి
ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో
మురిసే కూచిపూడి

వద్దంటే వినదే
పగలంతా ఆడిపాడి
ముద్దయిన తినదే
పరిగెత్తే పైడి లేడి

చిలకల్లే చెవిలో
ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైన
ఏం చేయాలి

________________

పాట: గుమ్మడి గుమ్మాడి
మూవీ:- డాడీ
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: వివేక్ హరిహరన్

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.