56
ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగులు ఉపయోగించడాన్ని నిషేధించే ఉత్తర్వులు జారీ చేసింది. చికెన్, ఫిష్ కబాబ్, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని పేర్కొంది. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్‌ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.